OnePlus 13 Smartphone: వన్‌ప్లస్ కంపెనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 15 ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. చైనాలో ఈ ఫోన్ ఆవిష్కరణ ఈ వారంలోనే జరగనున్నట్లు సమాచారం. ఈ లాంచ్‌లో వన్‌ప్లస్ ఏస్ 6 ఫోన్ కూడా విడుదల కానుంది. ఇప్పటికే వన్‌ప్లస్ 15 ఫోన్ గురించి పలు వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. వాటి ప్రకారం ఈసారి వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ధర వన్‌ప్లస్ 13 కంటే తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
ట్విట్ పోస్ట్ లీక్ వివరాల ప్రకారం
టెక్ టిప్‌స్టర్ అర్సెన్ లుపిన్ (@MysteryLupin) ఎక్స్ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం, వన్‌ప్లస్ 15 యొక్క 16జిబి ర్యామ్ ప్లస్ 512జిబి స్టోరేజ్ వెర్షన్ ధర జిబిపి 949 సుమారు రూ.1,11,000 గా ఉండవచ్చని తెలిపారు. అయితే, భారత మార్కెట్‌లో బేస్ మోడల్ ధర రూ.70,000 నుంచి రూ.75,000 మధ్య ఉండవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. గతంలో వన్‌ప్లస్ 13 16జిబి ప్లస్ 512జిబి మోడల్ ధర జిబిపి 999 సుమారు రూ.1,17,000గా ఉన్న విషయం తెలిసిందే. దాంతో పోలిస్తే, వన్‌ప్లస్ 15 దాదాపు రూ.6,000 తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని టాక్.
అప్‌గ్రేడ్ ఫీచర్లు
లీక్‌ల ప్రకారం, ఈసారి వన్‌ప్లస్ 15లో పలు అప్‌గ్రేడ్ ఫీచర్లు ఉండనున్నాయి. ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉండబోతోంది. ఇది ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌లలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ కొత్త చిప్‌సెట్ వేగాన్ని పెంచడమే కాకుండా పవర్ వినియోగాన్ని కూడా తగ్గించనుంది.
300mAh గ్లేసియర్ బ్యాటరీ
వన్‌ప్లస్ 15లో 7,300mAh గ్లేసియర్ బ్యాటరీ ఉండనుంది. ఇది కంపెనీ ఇప్పటివరకు అందించిన అత్యంత భారీ బ్యాటరీగా చెప్పవచ్చు. దీని కోసం 120W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ మరియు 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ సదుపాయం కూడా ఉండబోతోంది. అంటే తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
Also Read: Nokia Luxury 5G Mobile: 8000mAh బ్యాటరీతో దుమ్ము రేపిన నోకియా.. ధర కేవలం రూ.8,499లు మాత్రమే
ఓరియెంటల్ ఓల్డ్ డిస్‌ప్లే
డిస్‌ప్లే విషయానికి వస్తే, వన్‌ప్లస్ 15లో మూడో తరం 1.5కె బో (BOE) ఫ్లెక్సిబుల్ ఓరియెంటల్ ఓల్డ్ డిస్‌ప్లేను ఉపయోగిస్తున్నారు. దీని 165Hz రిఫ్రెష్ రేట్ వలన యూజర్లు మరింత స్మూత్ అనుభవాన్ని పొందగలరని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త ప్యానెల్ పాత మోడళ్లతో పోలిస్తే 13 శాతం ఎక్కువ బ్రైట్‌నెస్, 11.8 శాతం మెరుగైన రంగుల ఖచ్చితత్వం అందించనుంది.
50ఎంపి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్
కెమెరా విభాగంలో కూడా పెద్ద మార్పులు ఉండబోతున్నాయి. వన్‌ప్లస్ 15లో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండబోతున్నాయి. వీటిని కొత్త స్క్వేర్ షేప్ మాడ్యూల్‌లో అమర్చారు. ఇందులో ప్రధాన సెన్సార్‌గా సోనీ లెన్స్, అలాగే 50ఎంపి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంది. ఇది 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా దూరంలోని వస్తువులను కూడా క్లారిటీగా చిత్రీకరించవచ్చు.
వన్‌ప్లస్ 15లో కొత్త డిజైన్
వన్‌ప్లస్ 15లో కొత్త డిజైన్‌తో పాటు సాఫ్ట్‌వేర్ పనితీరు కూడా మెరుగుపరచబడిందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ గేమింగ్ యూజర్లకు కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఇప్పటికీ వన్‌ప్లస్ కంపెనీ నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు. కానీ ఈ లీక్ వివరాలు నిజమైతే, వన్‌ప్లస్ 15 ఫోన్ 2025లో అత్యంత పోటీగా ఉండే అండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌గా నిలిచే అవకాశం ఉంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తూ, మార్కెట్లో కొత్త పోటీని తెచ్చే అవకాశం కనిపిస్తోంది.