BigTV English

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను
Advertisement

RGV : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంచలనాత్మకమైన దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. శివ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. శివ సినిమా చూసిన తర్వాత చాలావరకు ఆర్జీవి రూల్స్ బ్రేక్ చేశాడు అని చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఆర్జీవి రూల్స్ ఏమీ బ్రేక్ చేయలేదు. ఎందుకంటే ఆర్జీవికి అసలు రూల్స్ అంటే ఏంటో తెలియదు.


తనకు కావాల్సింది కెమెరామెన్ కి ఇలా కావాలి అని చెప్పేవాడు. అయితే ఆ సినిమాకి కో డైరెక్టర్ గా శివ నాగేశ్వరరావు పనిచేశారు. అప్పటికి కూడా కొన్ని విషయాల్లో ఇది జరగదు అని ప్రాక్టికల్ గా చెప్పేవాడు శివ నాగేశ్వరావు. అలానే రామ్ గోపాల్ వర్మ కి యాక్షన్ కట్ అని చెప్పడం కూడా సరిగ్గా తెలిసేది కాదు. శివ నాగేశ్వరరావు రామ్ గోపాల్ వర్మ చెవిలో చెబితే వర్మ చెప్పేవాడట.

సీడీ అమ్ముకునే స్థాయి నుంచి

ఏదో ముఖ్యమైన పనిమీద వెళుతున్న రాంగోపాల్ వర్మ ఒక దగ్గర బైక్ ఆపి అక్కడ ఉన్న సీడీ ల షాప్ కి వెళ్లడట. అక్కడ వీడియో లైబ్రరీ చూడగానే చాలా ఆసక్తికరంగా అనిపించింది వర్మకు. అప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వర్మకు తను కూడా అలాంటిది స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడట. ఉన్న ఉద్యోగం కూడా మానేసి ఆ పనిలో పడ్డాడు.


కేవలం 5000 రూపాయలతో ఆ బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. అమీర్పేట్ లో రామ్ గోపాల్ వర్మ కి మొదట వీడియో లైబ్రరీ ఉండేది. దానిలో హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన సిడి లు కూడా ఉండేవి. అయితే రామ్ గోపాల్ వర్మ వీడియో లైబ్రరీకి చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చేవాళ్ళు. అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధించిన సురేంద్ర అక్కినేని వెంకట్ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు.

కథలు చెప్పడం మొదలుపెట్టాడు 

మామూలుగా ఒక సిడి కొనేముందు ఆ సినిమా కథను చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పేవాడట రామ్ గోపాల్ వర్మ. అలా రాంగోపాల్ వర్మ కథను చెప్పే విధానం నచ్చి ఆ సినిమా సీడీను చాలా ఆసక్తితో కొంతమంది తీసుకెళ్లే వారట. అయితే సినిమా చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ చెప్పిన కథ చాలా బాగుంది అని ఫీల్ అయ్యేవారు.

అప్పటికే రాంగోపాల్ వర్మ వాళ్ళ ఫాదర్ అన్నపూర్ణ స్టూడియోలో పనిచేయడం వలన. అక్కినేని ఫ్యామిలీతో మాట్లాడే అవకాశం ఆయనకు కూడా దక్కింది. అలా అక్కినేని వెంకట్ సురేంద్ర పరిచయం వలన శివ సినిమా అవకాశం దక్కింది. అప్పటికి సినిమాలు గురించి పెద్దగా ఏమీ తెలియకపోయినా తనకి హాలీవుడ్ సినిమా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉన్న అవగాహనతో వర్మాను బలంగా నమ్మారు. కట్ చేస్తే శివ బ్లాక్ బస్టర్ అయింది.

Also Read: SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Tags

Related News

Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Fauzi Movie: ప్రభాస్ ఫౌజీలో మరో ముద్దుగుమ్మ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి!

Big Stories

×