Big Stories

ICICI Bank:17 వేల ఐసీఐసీఐ క్రెడిక్ కార్డులు బ్లాక్..ఎందుకంటే ?

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ 17 వేల ఖాతాదారుల క్రెడిట్‌ కార్డులను బ్లాక్ చేసింది. తమ ఖాతాదారుల క్రెడిట్‌ కార్డుల సమాచారం ఇతర ఖాతాలకు పొరపాటున లింక్‌ అయినట్లు బ్యాంక్ పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా తప్పు జరిగిందని అంగీకరించింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది.

- Advertisement -

డేటా దుర్వినియోగం జరగినట్లు తమకు సమాచారం రాలేదని బ్యాంక్ తెలిపింది. క్రెడిట్‌కార్డుల వివరాలు ఇతర ఖాతాకు లింక్ అయినట్లు గుర్తించిన వెంటనే సవరించినట్లు వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఐమొబైల్ పే యాప్ వాడుతున్న ఖాతాదారులకు ఇతరుల క్రెడిట్ కార్డ్ లు తప్పుగా లింక్ అయ్యాయి. అంతే కాకుండా క్రెడిట్ కార్ట్ నెంబర్లు, సీవీవీ కనిపించాయి.

- Advertisement -

క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోని వారి యాప్ లో కూడా ఈ వివరాలు కనిపించాయి.ఆన్‌లైన్‌లో లాగిన్ అవ్వగానే తాము కొత్తగా దరఖాస్తు చేయకపోయనా కొత్త కార్డ్ వివరాలు కనిపించాయని కొందరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన బ్యాంక్‌ అధికారులు వెంటనే సమస్యను గుర్తించి సవరించినట్లు తెలిసింది. తర్వాత పొరపాటున ఇదంతా జరిగినట్లు అంగీకరిస్తూ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది.

Also Read:తత్కాల్ టిక్కెట్ బుక్ అవడం లేదా? .. ఇలా చేస్తే మీ టిక్కెట్ కన్ఫామ్!

ఈ సంఘటనలో ఖాతాదారులకు కాకుండా ఇతరులకు వివరాలు కనిపించిన ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. అలాంటి వారికి తిరిగి కొత్త కార్డులు ఇస్తామని..ఇప్పటివరకూ ఆర్థిక నష్టానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపింది. ఒకవేళ నష్టపోయిన కస్టమర్లు బ్యాంక్‌ను సంప్రదిస్తే పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News