Big Stories

HyperOS Update : ఈ ఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే!

HyperOS Update : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ ఫోన్లు యూజ్ చేసే వారికి ఎంఐయూఐ (MIUI) సాఫ్ట్‌వేర్ తెలిసే ఉంటుంది. అయితే షియోమీ పదేళ్లుగా హైపర్ ఓస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను డెవలప్ చేసింది. ఇందులో అనేక లేటెస్ట్ ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ కొత్త అప్‌డేట్ Xiaomi 11T ప్రో స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. తన వినియోగదారుల కూడా ఈ ఓస్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ HyperOS అప్‌డేట్‌ను Poco F4 తీసుకురానుంది. POCO F4 ఇప్పటికే MIUI 14 ఆధారిత Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతోంది. ప్రస్తుతం ఇది కొన్ని దేశాలకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్ పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

POCO F4 కొత్త అప్‌డేట్‌లో అనేక కొత్త ఫీచర్లను చేర్చారు. అయితే MIUIలో లిమిటెడ్‌గా కొన్ని ఫీచర్లు  మాత్రమే అందుబాటులో ఉన్నాయి. HyperOS విడ్జెట్ యానిమేషన్‌లు, హోమ్‌స్క్రీన్, లాక్ స్టైల్‌లను యాడ్ చేస్తుంది. POCO F4 ఇప్పటికే MIUI 14 ఆధారిత Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతోంది. అయితే ఇప్పుడు ఇది Xiaomi నుండి కొత్త అప్‌డేట్‌ను పొందుతుంది. ప్రస్తుతం ఇది కొన్ని దేశాలకు మాత్రమే విడుదల చేశారు.

- Advertisement -

Also Read : కిర్రాక్ ఆఫర్.. ఇలా కొంటే రూ.400లకే 5G స్మార్ట్‌ఫోన్!

ఈ ఓస్ మీ ఫోన్‌లో అందుబాటులో ఉంటే, మీరు సెట్టింగ్‌లకు వెళ్లి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అది అందుబాటులో లేకుంటే మీరు దాని కోసం వెయిట్ చేయాల్సి ఉంది. అప్‌డేట్ ఫుల్ వెర్షన్‌తో ఇంకా రిలీజ్ కాలేదు. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కొత్త అప్‌డేట్ 5GB వరకు స్టోరేజ్ ఉంటుంది. ఇది ఏప్రిల్ 2024 సెక్యూరిటీ ప్యాచ్‌తో వస్తుంది.

కొత్త HyperOS అప్‌డేట్ మొదటిలో గ్లోబల్ డివైజ్‌ల కోసం అందుబాటులోకి వచ్చింది. అయితే Poco F4 స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడినట్లయితే ఇది రెండు సంవత్సరాల క్రితం జూన్‌లో ప్రారంభించారు.  ఇప్పటివరకు ఉన్న షియోమీ డివైజుల్లో బెటర్ పర్ఫామెన్స్ ఇస్తుంది. ఇది  స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది భారీ టాస్కింగ్‌ను సులభంగా నిర్వహించగలదు.

Also Read : 108 MP కెమెరాతో అదిరిపోయే ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు వైరల్

Poco F4 లాంచ్ సమయంలో ఆండ్రాయిడ్ 12లో రన్ అయింది. కానీ ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతోంది. ఇది రాబోయే కొద్ది వారాల్లో Xiaomi నుండి కొత్త అప్‌డేట్‌ను కూడా పొందుతుంది. కొత్త అప్‌డేట్ కోసం 1.0.1.0.ULMMIXMతో వస్తుంది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు అప్‌గ్రేడ్‌లుగా ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News