BigTV English

CM Revanth Reddy: ‘మోదీ గ్యారంటీకి వారంటీ ముగిసింది.. రాహుల్ గాంధీనే ప్రధాని’

CM Revanth Reddy: ‘మోదీ గ్యారంటీకి వారంటీ ముగిసింది.. రాహుల్ గాంధీనే ప్రధాని’

CM Revanth Reddy latest speech(Political news in telangana): దేశాన్ని పదేళ్లుగా పాలిస్తున్న బీజేపీ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీ ఇచ్చే గ్యారంటీలకు వారంటీ ముగిసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.


బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా అంబర్‌పేట్ లో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దానం నాగేందర్‌ను లక్ష మోజార్టీతో గెలిపిస్తే.. కేంద్రమంత్రిని చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. మోదీ ఇచ్చిన గ్యారంటీలకు వారంటీ ముగిసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.


పదేళ్లు పాలించిన బీజేపీ.. తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శల వర్షం కురిపించారు. తమ పథకాలు అమలువుతున్నాయో లేదో తెలుకునేందుకు.. కేటీఆర్ చీర కట్టుకుని బస్సులో ప్రయాణిస్తే ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై అవగాహన వస్తుందని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ కు తాము గతంలోనే కృష్ణా, గోదావరి జలాలు తీసుకువచ్చామని వెల్లడించారు. హైదరాబాద్ కు మెట్రో రైలు రావడానికి కూడా కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ కు ఓఆర్ఆర్, ఫార్మా పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు.

Also Read: రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఇకపై అంబర్‌పేట్ లోని బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తండ్రీకొడుకులు ఇంకెన్లాళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారని మండిపడ్డారు. మరోసారి కిషన్ రెడ్డిని ఎంపీ చేయవద్దని.. ఆయన వల్ల ఉపయోగం లేదన్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×