Big Stories

Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Rythu bharosa: సార్వత్రిక ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటుగా రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసింది. ఈ మేరకు ఈసీ నుంచి అనుమతులు తీసుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

- Advertisement -

తెలంగాణలో పంట నష్టం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నిధుల విడుదలకు ఈసీ అనుమతించడంతో రూ. 15,81,14,000లను విడుదల చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15,814 ఎకరాల్లో పంట నష్టం జరగగా.. 15,246 మంది రైతులకు పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -

కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 10,000 ఎకరాల్ల పంట నష్టం జరగిట్లు ప్రభుత్వం తెలిపింది. సంగారెడ్డిలో అత్యల్పంగా 76 ఎకరాల్లో పంట నష్టపోయిందని వెల్లడించింది. ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున నష్ట పరిహారం అందించనున్నారు.

5 ఎకరాలు పైబడిన వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కాంగ్రెస్ సర్కార్ ఈసీ నుంచి అనుమతితో నిధులను విడుదల చేస్తోంది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేస్తోంది.

ఇప్పటికే ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులతు ప్రభుత్వం గతంలో విడుదల చేసింది. కాగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఎకరాలు పైబడిన రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రూ. 2వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో లబ్ధిదారుల అందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Also Read: కేసీఆర్ బాటలో సీఎం రేవంత్, ఆ బాధ్యత మేం తీసుకుంటాం

ఎన్నికల కోడ్ అమలవుతున్నా సరే ప్రభుత్వం ఈసీ నుంచి అన్ని అనుమతులు తీసుకుని రైతులకు నష్టపరిహారంతో పాటుగా.. రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయడంతో రైతులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు రైతు భరోసా వేయకుండా మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుండగా.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా, పంట నష్టం నిధులను విడుదల చేసారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News