E-Paper
Advertisement

Viral Video: కారును వెంబడించి, ఆపై దాడి ! వీడియో వైరల్

Viral Video: కారును వెంబడించి, ఆపై దాడి ! వీడియో వైరల్
Advertisement

Viral Video: నోయిడాలో అర్థరాత్రి కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబానికి భయానక అనుభవం ఎదురైంది. ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా బీఎండబ్యూ కారులో వచ్చిన కొందరు వారి కారు సైడ్ వ్యూ మిర్రర్ ను ఢీ కొట్టి అనంతరం వారిని వెంబడించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

నోయిడాలో కారులో ఉన్న కుటుంబాన్ని మరో కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు వెంబడించారు. అనంతరం కారు మిర్రర్ ను ఢీ కొట్టి వారిని వెంబడించి ఓ చోట కారును క్రాస్ చేసి వెళ్లారు. అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు క్రిందకు దిగారు. అనంతరం కారులో ఉన్న కుటుంబంపై రాళ్లు, బాటిల్స్ విసిరారు. దీంతో కారులో ఉన్న వారు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది.

Advertisement

ఈ నెల 2వ తేదీన అర్థరాత్రి 1.15 గంటల సమయంలో ఒక కుటుంబం ఆసుపత్రికి  కారులో బయలు దేరింది. అయితే వారి రోడ్డు మార్గంలో ఎదురుగా వచ్చిన మరో కారు సైడ్ మిర్రర్ ను తాకింది. కుటుంబం ప్రయాణిస్తున్న కారును బీఎండబ్యూ కారులో వచ్చిన వ్యక్తులు రెండు కిలో మీటర్ల వరకూ వెంబడించారు. అనంతరం వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో కుటుంబం ఉన్న కారు వేగంగా రివర్స్ చేసి అక్కడ నుంచి వెళ్లి పోయింది.

Also Read: చివరి క్షణంలో పెళ్లికి నిరాకరించిన వరుడు.. కారణం తెలిసి అంతా షాక్ ( వైరల్ వీడియో)

Advertisement

ఇదిలా ఉంటే కారులోని డ్యాష్ క్యామ్ లో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందుకు సంబంధించి తమకు ఫిర్యాదు రాలేదని పోలీసులు వెల్లడించారు. వీడియో క్లిప్ పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×