Big Stories

IRCTC Tatkal Ticket : తత్కాల్ టిక్కెట్ బుక్ అవడం లేదా? .. ఇలా చేస్తే మీ టిక్కెట్ కన్ఫామ్!

IRCTC Tatkal Ticket : దేశంలోని జనాభా ఎక్కువ శాతం రైళ్లలో జర్నీ చేస్తుంటారు. రోజూ కోట్లాది మంది జనాభా రైళ్లలోనే వారి గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. కుటుంబంతో కలిసి ట్రిప్పులకు వెళ్లాల్సి వచ్చినా లేదా దూరప్రాంతాలకు వెళ్లాలన్నా మనలో ప్రతి ఒక్కరికి మొదటగా ట్రైనే గుర్తొస్తుంది. వేసవి సెలవుల్లో రైల్వే స్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణానికి ముందుగానే రైలు టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. చాలా సార్లు వెయిటింగ్ లిస్ట్ కారణంగా తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకుంటారు. తత్కాల్ టిక్కెట్‌ను మీరు సులభంగా ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి.

- Advertisement -

టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనకు లాంగ్ వెయిటింగ్ లిస్ట్ చూపిస్తే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు కన్ఫర్మ్ టిక్కెట్ కోసం తత్కాల్ టికెట్‌ను చేసుకోల్సి ఉంటుంది. కన్ఫర్మ్ టిక్కెట్ల కోసం తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే కొంత సమయం కారణంగా ఆ సందర్భంలో కూడా కన్ఫర్మ్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు. తత్కాల్ టికెట్ బుకింగ్ అంత సులభం కాదు. తత్కాల్ టికెట్ విండో కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇంటర్నెట్ సమస్య లేదా స్లో సర్వర్ కారణంగా టికెట్ బుక్ అవ్వదు.

- Advertisement -

Also Read : పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

కన్ఫర్మ్ తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి..?

  • తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మీరు IRCTC వెబ్‌సైట్‌, యాప్‌కు వెళ్లాలి.
  • మీరు యాప్‌లో టిక్కెట్ బుక్ చేయాలంటే అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి.
  • దీని తర్వాత మీరు ‘మై అకౌంట్’పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీరు మాస్టర్ జాబితా ఆప్షన్‌కు వెళ్లాలి.
  • తర్వాత ప్రయాణీకుల అన్ని ముఖ్యమైన డేటాను ఫిల్ చేయాలి.
  • మీరు ప్రయాణికుల గురించి సమాచారాన్ని అందించిన తర్వాత, దీన్ని మళ్లీ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు తత్కాల్ టికెట్ విండో ఓపెన్ చేసి మీరు మీ ప్రయాణ వివరాలను ఇవ్వాలి.
  • దీని తర్వాత మాస్టర్ జాబితాలో ఉన్న మీ సమాచారం కనిపిస్తుంది. మీ సమయం ఆదా అవుతుంది.
  • ఇప్పుడు మీరు పే మెంట్ మాత్రమే చేయాలి. మీరు పేమెంట్ చేసిన వెంటనే టికెట్ కన్ఫామ్ అవుతుంది.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News