E-Paper
Advertisement

Anshu Ambani: మన్మథుడు బ్యూటీ రీఎంట్రీ.. మరీ తల్లి పాత్రలోనా.. ?

Anshu Ambani: మన్మథుడు బ్యూటీ రీఎంట్రీ.. మరీ తల్లి పాత్రలోనా.. ?
Advertisement

Anshu Ambani: ప్రస్తుతం కుర్ర హీరోయిన్లు ఎలా ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్నారో.. సీనియర్ హీరోయిన్లు కూడా రీఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. ఇప్పటికే ప్రియమణి, మీరా జాస్మిన్, రంభ, లయ.. ఇలా ఒక్కొకరుగా ఎంట్రీ ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది అన్షు అంబానీ. మన్మథుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కొలువైపోయింది. ఆ తరువాత ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా తెలుగువారికి మాత్రం మన్మథుడు మల్లీశ్వరిగానే గుర్తుండిపోయింది.

ఇక సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే.. సచిన్ సాగర్ అనే వ్యక్తిని వివాహమాడి లండన్ వెళ్ళిపోయింది. అక్కడే పిల్లలు.. వర్క్ చేస్తూ బిజీగా మారింది. ఇక మన్మథుడు రీ రిలీజ్ సమయంలో ఆమె పేరు మరోమారు ట్రెండ్ అయ్యింది. దాని తరువాత ఇండియాకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడంతో అమ్మడి గురించి పూర్తిగా తెల్సింది. అప్పటికీ.. ఇప్పటికీ ఆమె ఆ అందాన్ని మెయింటైన్ చేస్తూనే ఉంది. తాజాగా అన్షు రీఎంట్రీ రెడీ అయ్యిందని తెలుస్తోంది.

Advertisement

దాదాపు 21 ఏళ్ళ తరువాత అన్షు రీఎంట్రీ ఇవ్వనుంది. కుర్ర హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అన్షు ఛాన్స్ పట్టేసిందని టాక్. అయితే ఎలాంటి పాత్ర అనేది ఇంకా బయటకు రాలేదు.

కొంతమంది చిన్నప్పటి సందీప్ కిషన్ కు తల్లిగా నటిస్తుందని అంటున్నారు. అయితే మరీ ఈ ఏజ్ లోనే తల్లి పాత్రలో అంటే కష్టమేమో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. హీరోకు అక్కగానో.. వదినగానో అయితే బావుంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో అనేది తెలియాల్సి ఉంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×