E-Paper
Advertisement

Anupama Parameswaran: లాక్ డౌన్ లో అనుపమ.. అసలేం జరిగింది.. ?

Anupama Parameswaran: లాక్ డౌన్ లో అనుపమ.. అసలేం జరిగింది.. ?
Advertisement

Anupama Parameswaran: టిల్లు స్క్వేర్ తో అనుపమ పరమేశ్వరన్ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు చేయకపోయినా టిల్లు స్క్వేర్ లో మాత్రం అదరగొట్టేసింది. రాధికా ప్లేస్ ను రీప్లేస్ చేస్తుంది అంటే.. అనుపమ లో అంత విషయం ఉంటుందా అని అనుకోని థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు తన చుక్కలు చూపించింది. ఈ సినిమా సక్సెస్ లో సగం క్రెడిట్ అనుపమకే పోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇక ఈ సినిమా తరువాత అనుపమ వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. ఇప్పటికే పరదా అనే సినిమాను ప్రకటించిన ఈ భామ.. తాజాగా నేడు తన రెండు సినిమాలను ప్రకటించింది. ఒకటి  ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న బైసన్ కాలమాడన్. ఇది కాకుండా అమ్మడు మరో ఛాన్స్ పట్టేసింది. అది కూడా లైకా ప్రొడక్షన్స్ లో అంటే పెద్ద సినిమానే అని చెప్పుకోవాలి. అనుపమ లేడీ ఓరియెంటెడ్ గా నటిస్తున్న చిత్రం లాక్ డౌన్.

Advertisement

AR జీవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శుభస్కరన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అనుపమ గట్టిగా ఏడుస్తూ అరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె ముఖానికి ఒకపక్క మట్టిని చూపించారు.

కరోనా తరువాత లాక్ డౌన్ అనేది ప్రపంచం మొత్తం అలవాటుగా మారిన పదం. మరి ఈ సినిమా కూడా లాక్ డౌన్ లోనే తీస్తారా.. ? అంటే ఒక్క పాత్ర మాత్రమే ఉండబోతుందా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇండియన్ 2 తో బిజీగా ఉన్న లైకా.. ఈ మధ్యకాలంలో మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో అనుపమ తన టిల్లు స్క్వేర్ విజయాన్ని కొనసాగిస్తుందో.. లేదో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×