Big Stories

MS Dhoni Cyber Scam : డబ్బులు లేక రోడ్డుపై ధోని.. రూ.600 ఫోన్ పే చేయాలని మెసేజ్?

MS Dhoni Cyber Scam : ఐపిఎల్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోని. సీఎస్‌కే మ్యాచ్ జరిగినప్పుడల్లా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే నిజంగా పిచ్చేక్కిపోతది. ధోని బ్యాట్ పట్టుకొని క్రీజ్‌లోకి దిగితే స్టేడియం అపురులు, కేకలతో దద్దిరిల్లి పోతుంది. ధోని చివరి రెండు ఓవర్లలో బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొందరైతే ధోని బ్యాటింగ్ కోసమే మ్యాచ్ చూస్తారు. అయితే ఇదంతా కాస్త పక్కనబెడితే ధోని పాపులారిటీని క్యాష్ చేసేందుకు స్కామర్లు ఫ్రాడ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని DoT తెలిపింది. ఈ మేరకు DoT India తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

- Advertisement -

మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఈ క్రమంలో స్కామర్లు ఆయన పేరుతో తప్పుడు సందేశాలను ప్రజలకు పంపుతున్నారు. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఈ విషయంలో హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. డాట్ ఆన్ X చేసిన పోస్ట్ ప్రకారం స్కామర్లు మనకు తెలియకుండానే మేసేజ్‌లు పంపుతారు.

- Advertisement -

Also Read : తత్కాల్ టిక్కెట్ బుక్ అవడం లేదా? .. ఇలా చేస్తే మీ టిక్కెట్ కన్ఫామ్!

అలానే హాయ్ నేను MS ధోని నేను నా పర్సనల్ మొబైల్ నంబర్ ‌నుంచి మీకు మేసేజ్ పంపుతున్నాను. నేను ప్రస్తుతం రాంచీ శివార్లలో ఉన్నాను.. నా వాలెట్‌ను మర్చిపోయాను. నేను బస్సులో ఇంటికి తిరిగి వెళ్లడానికి దయచేసి ఫోన్‌పే ద్వారా రూ. 600 సెండ్ చేయండి అని ఉంటుంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని మీరు ట్వీట్‌లో చూడవచ్చు.

ఈ ఫేక్ మెసేజ్‌ని షేర్ చేయడంతో పాటు ఇలాంటి మెసేజ్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని DoT సూచించింది. ఇది మాత్రమే కాదు మెసేజ్‌లో స్కామర్ ధోని సెల్ఫీని ప్రూఫ్‌గా పంపాడు. దాని క్రింద విజిల్ పోడు అని రాశారు. ఈ డైలాగ్ CSK తన క్యాంపెయిన్‌లో వాడుతుంది.

Also Read : స్పోర్టీ లుక్‌తో పల్సర్ NS400.. మే 3న లాంచ్!

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) అటువంటి సందేశాన్ని లేదా కాల్‌లను అస్సలు నమ్మవద్దని సలహా ఇస్తుంది. ఫిర్యాదు చేసే పద్ధతిని కూడా తెలిపింది. మీకు అలాంటి సందేశం వస్తే, మీరు దాని గురించి sancharsaathi.gov.in/sfcలో ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా మెసేజ్ వచ్చిన వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News