Big Stories

Aloe Vera: బ్యూటీ క్రీమ్స్ కు బదులు ఈ జెల్ రాస్తే.. మెరిసే ముఖం మీ సొంతం.

Aloe Vera For Skin Care: మనలో చాలామంది రకరకాల ఫంక్షన్స్, పార్టీలకు వెలుతుంటారు. అలాంటప్పుడు అందరి కంటే కొంచం స్పెషల్ గా కనిపించాలని ఎవరికైనా ఉంటుంది. ప్రతి ఒక్కరు చర్మం కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో పార్లర్స్‌కి వెళ్తుంటారు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే అందంగా కనిపించొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

అలోవెరా జెల్ నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దీన్ని ఫేస్ కి అప్లై చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖానికి ఇది సహజ కాంతినిస్తుంది. చాలా మంది ముఖం అందంగా కనిపించడానికి రకరకాల క్రీములు, ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ వాటిలో ఉపయోగించే రసాయనాల వల్ల మన చర్మానికి హాని కలుగుతుంది.

- Advertisement -

కలబంద ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలకు వాడే ఔషధాల్లో కూడా అలోవెరాను ఉపయోగిస్తారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు అందాన్ని పెంచడంతో పాటు చర్మాన్ని మెరిపించి వయసును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కలబందలో అధిక మొత్తంలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. విటమిన్ ఎ,బి లు ఇందులో ఉంటాయి. అలోవెరాలో ఉండే మినరల్స్ చర్మంలోకి చొచ్చుకు వెళ్లి మృత కణాలను తొలగిస్తాయి.

మెరిసే చర్మం కోసం:

అలోవెరా జెల్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి అలోవెరా జెల్ ను అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం నీటితో శుభ్ర పరుచుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా చర్మంపై ఉన్న మొటిమలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది.

రోజ్ వాటర్, అలోవెరా జెల్ ను సమపాళ్లలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయండి. దీన్ని కాసేపు చర్మంపై మసాజ్ చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం సహజ మెరుపును సంతరించుకుంటుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఒక స్పూన్ అలోవెరా జెల్ లో కాస్త తేనె కలిపి మిశ్రమాన్ని తయారుచేయాలి. దీని ముఖంతో పాటు మెడకు అప్లై చేయాలి. ఆ తర్వాత చర్మాన్ని మసాజ్ చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Also Read: విపరీతంగా జుట్టు రాలిపోతుందా ? ఈ టిప్స్ మీ కోసమే..

అలోవెరా జెల్ లో కొంత నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్, మెడపై అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత దీన్ని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి 2,3 సార్లు చేస్తే అందమైన ముఖం మీ సొంతం అవుతుంది. ముడతలు పడిన చర్మం తిరిగి జీవం పోసుకోవడానికి బాదం నూనెలో, అలోవెరా జెల్ కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఫేస్ క్లీన్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మంపై ముడతలు పోయి జీవం పోసుకుంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News