Big Stories

Indian army: మానవత్వం చాటుకున్న ఆర్మీ.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న గర్భిణీని..

Indian army: దేశాన్ని ఆర్మీ జవాన్లు కంటికి రెప్పలా చూసుకుంటారు. నిరంతరం బార్డరులో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తుంటారు. అంతేకాదు.. దేశంలో ఎప్పుడు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినా లేదా దేశ ప్రజలకు ఏదైనా ఆపద వచ్చినా వెంటనే వాలిపోయి హెల్ప్ చేస్తుంటారు. ఇలా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, ఇప్పుడెందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందే.. మన జవాన్లు మరోసారి మానవత్వం చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టుడాతున్న ఓ గర్భిణీని కాపాడారు. ఈ విషయం తెలిసి ప్రజలు ఆర్మీ జవాన్లను ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వాడా జిల్లాలో ఉన్నటువంటి నియంత్రణ రేఖ వెంట ఓ మారుమూల గ్రామం ఉంది. అయితే, ఆ గ్రామంలో ఓ గర్భిణీ ఆరోగ్యం పరిస్థితి విషమించింది. అయితే, అక్కడ ఆ గర్భిణీకి సరైన వైద్యం అందించేందుకు సరైనా ఆస్పత్రులు, వైద్యులు లేని పరిస్థితి. దీనికి తోడు అక్కడ భారీగా మంచు కురుస్తోంది. రోడ్లు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. దీంతో వాటిపై ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

Also Read: ‘ఏది ఏమైనా స్మృతి ఇరానీని ఓడించి తీరుతా’

దీంతో ఆ గర్భిణీని వేరే ప్రాంతానికి తీసుకెళ్లలేక కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆర్మీకి చేరవేశారు. విషయం తెలుసుకున్న తెలుసుకున్న భారత జవాన్లు రంగంలోకి దిగారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. జుమాగుండ్లోని ఆర్మీ యూనిట్ నర్సింగ్ అసిస్టెంట్, పీకే గలిలోని వైద్యాధికారి ఆమెకు మొదటగా ప్రథమి చికిత్స అందించారు. అయితే, మెరుగైన వైద్యం అందించాల్సి వచ్చింది. దీంతో ఆ గర్భిణీని స్ట్రెచర్ పైకి చేర్చి.. కాలినడకన ఇతర ప్రాంతానికి సురక్షితంగా తరలించారు జవాన్లు. ప్రస్తుతం ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి మన భారత జవాన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News