Rs 10,000 Discount on Ampere Electric Scooters: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లపైనే వాహన ప్రియుల ఆసక్తి ఉంది. అందువల్లనే రోజు రోజుకూ వీటి వినియోగం పెరిగిపోతోది. ఇందులో భాగంగానే ప్రముఖ బడా కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ భారీగా పెరగడంతో వీటి ధరలు కూడా అధికమయ్యాయి. తద్వారా ఒక సామాన్యుడు ఎలక్ట్రాక్ స్కూటర్ కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడైనా డిస్కౌంట్ ఆఫర్లు వస్తే అప్పుడు కొనుక్కోవచ్చులే అని ప్లాన్ చేసుకుంటున్నాడు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్.
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ తాజాగా తన మోడల్‌లోని కొన్నింటిపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఒక్కో స్కూటర్‌పై ఏకంగా రూ.10 వేల వరకు తగ్గింపు అందిస్తుంది. మరి అది ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఆంపియర్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. సేల్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. తమ సేల్స్‌ను మరింత పెంచేందుకు ఆంపియర్ తాజాగా తన స్కూటర్లపై రూ.10000 వరకు తగ్గింపును అందిస్తుంది. అందులో మ్యాగ్నస్ ఎక్స్ ఒకటి.
Ampere Magnus EX
Magnus EX ఎలక్ట్రిక్ స్కూటర్‌కి మార్కెట్‌లో మంచి పేరు ఉంది. ఇది ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అందులో ఓషన్ బ్లూ, గ్లేసియల్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, గెలాక్టిక్ గ్రే, మెటాలిక్ రెడ్ వంటివి ఉన్నాయి. ఈ స్కూటర్‌కి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 100 కి.మీ మైలేజీ ఇస్తుంది. కేవలం 10 సెకండ్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇందులో రివర్స్ మోడ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ స్కూటర్‌పై భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. ఏకంగా రూ.10 వేల తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ అనంతరం దీనిని రూ.94,900ల ఎక్స్ షోరూమ్ ధరకే కొనుక్కోవచ్చు.
Also Read: ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. ఇదిగో లిస్ట్..!
Ampere Magnus LT
అలాగే మరొక వేరియంట్ మ్యాగ్నస్ ఎల్‌టి (Magnus LT)పై కూడా బంపర్ ఆఫర్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో దీనిని రూ.84,900లకి కొనుక్కోవచ్చు. అయితే ఈ స్కూటర్లు ఇంత తక్కువ ధరలో రావటం ఇదే మొదటి సారి.
Ampere Reo Li Plus
దీంతోపాటు మరొక స్కూటర్ కూడా ఉంది. అదే ఆంపియర్ రియో ఎల్ఐ-ప్లస్. అయితే ఈ స్కూటర్ చాలా అంటే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు రూ.10 వేల భారీ తగ్గింపుతో రూ.59,900లకే కొనుక్కోవచ్చు అన్నమాట. దీంతో ఈ కంపెనీలో అత్యంత ‘లో’ వేరియంట్‌గా రియో ఎల్ఐ ప్లస్ ఉంది. ఇది గంటకు 25 కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది. దీనికి ఫుల్‌గా ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 70 కి.మీ మైలేజీ అందిస్తుంది.