Big Stories

Hair care : విపరీతంగా జుట్టు రాలిపోతుందా ? ఈ టిప్స్ మీ కోసమే..

Hair Fall Control Tips: జుట్టు రాలుతుంటే ఎంతటి వారికైనా ఎక్కడ లేని ఆందోళన మొదలవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గడానికి ఆలస్యం చేయకుండా రకరకాల షాంపులు, వంటింటి చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. నిజంగానే జుట్టు రాలుతుంటే చాలా బాధగా ఉంటుంది. అయితే జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, మారుతున్న జీవన శైలి, అనారోగ్య సమస్యలు ఇందుకు కారణం కావచ్చు.

- Advertisement -

జుట్టు రాలడం, పొడి బారడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు. బయోటిన్, ఐరన్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్లు బావించాలి. ఈ సమస్యను అధిగమించడం కోసం ప్రోటీన్ ఫుడ్ ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాన్ని డైట్ లో భాగంగా చేసుకోవాలి.

- Advertisement -

ఒత్తిడి, ప్రెగ్నెన్సీ, చర్మ వ్యాధులు, మందుల వాడకం, జన్యు పరమైన కారణాలతో పాటు వయస్సు  కూడా జుట్టు రాలడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు విపరీతంగా రాలుతుంటే..కారణం ఏమై ఉంటుందో  ముందుగా తెలుసుకోవాలి. జుట్టుకు వేసుకునే రంగులు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంటాయి. అందుకే రంగులకు దూరంగా ఉండాలి.

పోషకాహారం :

విటమిన్ ఎ, సి, బి – కాంప్లెక్స్,ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, గుడ్లు, పండ్లు ఎక్కువగా తినాలి. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకుండా ఉండడం ఉత్తమం వాల్ నట్స్ లో ఒమెగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేస్తాయి. అవకాడో వంటి ఫ్రూట్స్  డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

హెయిర్ మసాజ్ :
హెయిర్ మసాజ్ జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆయిల్ మసాజ్ రక్త ప్రసారాన్ని ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా హెయిర్ గ్రోత్ కు సహకరిస్తుంది. లావెండర్, రోజ్మేరీ వంటి ఆయిల్ లను కొబ్బరి, బాదం , ఆలివ్ ఆయిల్ లో కలిపి మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తలస్నానం చేసే గంట ముందు ఇలా చేయండి. తరుచూ ఇలా చేస్తూ ఉండటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు మృదువుగా తయారవుతుంది.

Also Read: హార్మోన్ల సమస్యా..? ఈ ఫుడ్స్ తో బ్యాలెన్స్ చేసుకోండి

షాంపూల ఎంపిక :
షాంపూలు, కండిషనర్లు, స్టైలింగ్ ఉత్పత్తుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు అవసరం. రసాయనాలు అధికంగా ఉండే షాంపులను ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ పెరుగుతుంది. జుట్టుకు హాని చేయని ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి. స్రెయిట్ నర్ ,కర్లియర్ వంటి సాధనాల వాడకం తగ్గించండి.

హెయిర్ కేర్ :
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సరైన హెయిర్ కేర్ ఫాలో అవ్వాలి. వారానికి రెండు సార్లు తలస్నానం చేయడం మంచిది. జుట్టు కోసం కండీషనర్ వాడడం ఎంతైనా అవసరం. తలస్నానం చేసినప్పుడు జుట్టును సున్నితంగా దువ్వాలి. ఇలాంటి సమయంలో కుదుళ్లు సున్నితంగా ఉంటాయి. జుట్టు ఆరబెట్టిన తర్వాత రెండు మూడు గంటలకు నిద్రపోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News