Jabardasth Pavithra Car Accident: ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్లు అధికమయ్యాయి. ఓవర్ స్పీడ్ లేక మరే ఇతర కారణాల వల్ల చాలా మంది యాక్సిడెంట్‌కు గురవుతున్నారు. అందులో కొందరు మరణిస్తున్నారు. మరికొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. అయితే ఇటీవలే సీరియల్ నటి పవిత్ర జయరామ్ కార్ యాక్సిడెంట్‌లో తన ప్రాణాలను విడిచింది. అయితే ఇప్పుడు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌లో ఆర్టిస్ట్‌గా ఉన్న పవిత్ర కారుకు భారీ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని పవిత్ర తాజాగా తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది.
ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఆ కార్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను మళ్లీ ఇలా కలుస్తానని అనుకోలేదు. అంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయినా కూడా నేను ప్రాణాలతో బయటపడ్డానంటే లిట్రల్లీ దేవుడే కారణం. ఇప్పటి వరకు నేను యాక్సిడెంట్స్ చూడటం తప్ప.. ఇదే ఫస్ట్ టైం యాక్స్‌పీరియన్స్ అయ్యాను. ఇంత భయంకరంగా ఉంది. ఈ ఘటనతో చాలా పానిక్ అయిపోయాను.
కార్ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. కారులో మా పిన్ని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు వాల్ల భయం ఎక్కువ పట్టేసింది. మేను ఓట్లు వేయడానికి ఆంధ్రా వచ్చాము. అయితే ఊరు వెళ్తున్న క్రమంలో హైవేపై ఒక కారు స్పీడుగా వస్తుంది. ఆ ఎదురుగా మేము వెళ్తున్నాం. హైవే కదా అని మినిమం 50, 60 స్పీడ్‌లో వెళ్తున్నాం. ఆ స్పీడ్‌లో ఎదురుగా వస్తున్న కారు ఇటు అటు తిరగడంతో.. మా డ్రైవర్ ఏం చేయాలో తెలియక సైడ్‌కి తిప్పేశాడు. కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న కార్.. మా కారు ఢీ కొన్నాయి. వాళ్ల కారు రోడ్ సైడ్‌లో ఆగిపోయింది.
Also Read: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో తల్లి మృతి!
అయితే మా కారు రోడ్ సైడ్ గుంతలో పడి ఫ్రంట్ టైర్ మొత్తం స్మాస్ అయిపోయింది. అయితే ఆ కారులో ఉండే ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ కావడం వల్ల ఆ డ్రైవర్‌తో పాటు నేను, మా పిన్ని, పిల్లలు సేఫ్ అయ్యాం. ఇంకో పది నిమిషాల్లో ఇంటికి రీచ్ అయిపోతామ్ అనే లోపల ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ యాక్సిడెంట్‌లో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదీగాక ఒక చావు అంచుల వరకు వెళ్లి వచ్చామంటే అది మామూలు విషయం కాదని తెలుపుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.