BigTV English

DIG Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు..

DIG Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు..

Anantapur DIG Ammireddy: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలోని పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఈసీ వేటును కొనసాగిస్తోంది. తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు వేసింది.


అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే ఆయన్ను విధుల నుంచి రిలీవ్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులను అప్పగించవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇటీవలే కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవలే అనంతపురం ఎస్సీ అన్బరాజన్ ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే అనంతపురం ఎస్సీ అన్బురాజన్ ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈయన కూడా రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఈసీకి భారీ ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో అన్బురాజన్ ను ఈసీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


అన్బురాజన్ స్థానంలో అమిత్ బర్దర్ ను ఈసీ అనంతపురం ఎస్పీగా నియమించింది. వీరితో పాటుగా అనంతపురం అర్బన్ డీఎస్పీగా టివివి ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును ఇప్పటికే ఎన్నికల సంఘం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ బదిలీలు జరగడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మరో వైపు కొత్త వారి నియామకాలు కూడా జోరుగా జరుగుతున్నాయి.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×