BigTV English

Husband Inserts Nails into Private Parts: భార్యపై అనుమానం.. ప్రైవేట్ పార్టులో బ్లేడుతో కోసి.. మేకులు గుచ్చి.. పైశాచికత్వం!

Husband Inserts Nails into Private Parts: భార్యపై అనుమానం.. ప్రైవేట్ పార్టులో బ్లేడుతో కోసి.. మేకులు గుచ్చి.. పైశాచికత్వం!

Nepali Husband Inserts Nails into Wife Private Parts: భార్యపై ఉన్న అనుమానం అతనిలోని మనిషిని చంపి.. రాక్షసుడిని నిద్రలేపింది. ఆమెకు మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ఆమె చేతులు, కాళ్లు గుడ్డలతో కట్టేసి దారుణంగా చావబాదాడు. ప్రైవేటు పార్టుకు బ్లేడుతో రెండు రంద్రాలు చేసి.. వాటిలో ఇనుపమేకులు పెట్టి.. తాళం వేశాడు. ఇంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించిన సైకో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.


30 ఏళ్ల నేపాలీ దేశస్తుడు.. తన 28 ఏళ్ల భార్యతో కలిసి మహారాష్ట్రలోని పింప్రి- చించ్ వాడ్ లో ఉంటున్నాడు. తన భార్యకు మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన అతను మే 11న ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. ప్రైవేట్ పార్టును పదునైన బ్లేడుతో కోస్తూ.. సైకోయిజాన్ని ప్రదర్శించాడు. తీవ్ర రక్తస్రావంతో అల్లాడిన ఆమె.. సహాయం కోసం గొంతు పెగిలేలా అరిచింది. నొప్పితో విలవిలలాడింది.

Also Read : భర్తను చంపేసి హార్ట్ ఎటాక్ అంటూ నాటకమాడిన భార్య.. తీరా చూస్తే..!


స్థానికులు మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుని.. కాస్త కోలుకున్న మహిళ.. జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు .. ఐపీసీ సెక్షన్లు 326, 506 (2), 323 కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

మహిళ భర్త వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఆమె గృహిణి. ఆమెపై జరిగిన దారుణాన్ని పోలీసులు ఖండించారు. ఆమె భర్తపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×