Big Stories

Guava Leaves: జామ ఆకులతో శరీరంలోని కొవ్వు ఖతం..

Guava Leaves:మార్కెట్లో దొరికే జామకాయలు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. జామకాయలు మధుమేహం, గుండె సంబంధింత వ్యాధులు, బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. తరచూ జామకాయలను తినడం ద్వారా చాలా వరకు శరీరంలోని పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే జామ కాయలతో కేవలం ఇవే కాకుండా శరీరంలోని కొలస్ట్రాల్‌ను కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

జామకాయల్లోనే కాకుండా జామ ఆకుల్లోను యాంటీ బాక్టీరియల్ గుణాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అయితే జామ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల్లో ముఖ్యంగా కొలస్ట్రాల్ తగ్గించుకోవడం ఒకటి.

- Advertisement -

కొలస్ట్రాల్ సమస్యతో బాధపడేవారికి జామ ఆకులు ఔషధంలా పనిచేస్తాయి. తరచూ పరిగడుపున ఈ ఆకులు తినడం వల్ల శరీరంలోని కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. ముఖ్యంగా షుగర్ సమస్యతో బాధపడేవారికి జామ ఆకులు చాలా సహకరిస్తాయి. వీటిలో ఉండే ఫినాలిక్ కాంటెంట్ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుంది. అంతేకాదు చర్మ ఆరోగ్యానికి కూడా జామ ఆకులు ఉపయోగపడతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News