Big Stories

Brij Bhushan Son gets BJP Ticket: బ్రిష్‌భూషణ్‌కు బీజేపీ టికెట్ నిరాకరణ.. బరిలోకి కుమారుడు

Brij Bhushan Son Gets BJP Ticket: భారత రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిష్ భూషణ్ సింగ్ కు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. బ్రిష్ భూషణ్ కు ఈ ఎన్నికల్లో టికెట్ ను నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన స్థానంలో ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ లోని కైసర్ గంజ్ స్థానం నుంచి కరణ్ సింగ్ పోటీ చేయనున్నారు.

- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్ లో బ్రిష్ భూషణ్ సింగ్ కు మంచి పలుకుబడి ఉంది. ఆయనపై ఎన్ని కేసులున్నా కూడా పాపులారిటీలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. భారీ కేసులున్నా ఎంపీగా ఆరు సార్లు ఎన్నికయ్యారు. కైసర్ గంజ్ నుంచి బ్రిష్ భూషణ్ పోటీ చేసి వరుసగా 3 సార్లు ఎన్నికయ్యారు. అంతేకాదు 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 2 లక్షల మెజార్టీతో గెలిచారు.

- Advertisement -

Also Read: Delhi Liquor Scam: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ను పరిగణలోకి తీసుకోవచ్చన సుప్రీం కోర్టు..

ఇటీవల రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. దీంతో బీజేపీ అధిష్టానం బ్రిష్ భూషణ్ ను పక్కనపెట్టింది. ఈ తరుణంలో బ్రిష్ భూషణ్ చిన్న కొడుకు కరణ్ సింగ్ కు టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం కరణ్ యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News