Big Stories

CM Revanth Reddy in Siddipet: సిద్దిపేటలో దొరల పాలన అంతం చేయాలి: రేవంత్ రెడ్డి పిలుపు!

CM Revanth Reddy Speech in Siddipet: మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేట రోడ్ షోలో పాల్గొన్న సీఎం ప్రసంగించారు. మామ కేసీఆర్, అల్లుడు హరీష్ రావుల నుంచి సిద్దిపేటకు విముక్తి కలిగించేందుకు వచ్చానని తెలిపారు. మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఎంపీగా పోటీ చేసి గెలిచారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ హయాంలో మెదక్ కు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని అన్నారు.

- Advertisement -

కొమురవెళ్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ చేసి..సిద్దిపేటకు మరోసారి వస్తానని అన్నారు. హరీష్ రావు తన రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. శనీశ్వరరావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తానని అన్నారు. పదేళ్లలో ఢిల్లీ దొర, సిద్దిపేట దొర తెలంగాణ కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. మామ పోతే.. అల్లుడు అన్నట్లుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారని తెలిపారు.

- Advertisement -

దొరల గడీలను బద్దల కొట్టకపోతే ఎప్పటికీ అభివృద్ధి జరగదని అన్నారు. ఎన్నికల్లో నీలం మధును లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముదిరాజ్ లకు మంత్రి పదవి ఇస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్నోళ్లు కావాలో.. ప్రజలకు మంచి చేసే వాళ్లు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. శాశ్వత బానిసత్వం వస్తుందని పేర్కొన్నారు.

Also Read: రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా : రేవంత్ రెడ్డి

ప్రజల భూములు లాక్కున్న వాళ్లే ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. అలాంటి నేతలకు ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ గెలవాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదు అని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News