Big Stories

Janasena Glass Symbol: పగిలిన గ్లాస్.. గుచ్చుకునేది ఎవరికి?

- Advertisement -

ఆఖరికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తను యాక్ట్ చేసిన మూవీస్‌లో కూడా గాజుగ్లాస్‌పై స్పెషల్ డైలాగ్స్, సీన్స్‌ పెట్టించారు. సో గాజుగ్లాస్‌ అంటే జనసేన అనేంతగా వెళ్లింది ఈ సింబల్.. కానీ ఇంతా కష్టపడితే జరిగిందేంటి ఏకంగా దాదాపు 60 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈ సింబల్‌ను కేటాయించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. దీంతో జనసేన నేతలకు సాలిడ్ షాక్‌ తగిలినట్టైంది. నిజానికి కొన్ని రోజుల క్రితమే గాజుగ్లాస్ ఫ్రీసింబల్ లిస్ట్‌లో ఉందని ఏప్రిల్ ఫస్ట్‌న గెజిట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందులో జనసేన రిజిస్టర్‌ పార్టీ జాబితాలో ఉంది.. గాజుగ్లాస్ సింబల్ ఫ్రీసింబల్స్ లిస్ట్‌లో ఉంది. నిజానికి జనసేన నేతలు ఆరోజే మేల్కోని కాస్త పోరాడిల్సింది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే గెజిట్ ప్రకారం ఎవరైనా ఆ గుర్తు కోసం కాంపిటిషస్‌కు వస్తే దానిని అలాట్ చేసే హక్కు ఈసీకి ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది.

- Advertisement -

Also Read: అది మేనిఫెస్టో కాదు మనీ ఫీస్ట్!

అయితే ఇక్కడ ఓ తిరకాసు ఉంది.. అదే ఇప్పుడు జనసేన న్యాయపోరాటానికి ఆధారం. అదేంటంటే.. ఎలక్షన్‌ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జనవరిలో ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది.. అందులో జనసేనకు గాజుగ్లాస్‌ను కేటాయించాలని మెన్షన్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ మాత్రం.. 2023లో ఈసీ జారి చేసిన నోటిఫికేషన్ ఆధారంగా విడుదల చేసింది. మరి 2023లో రిలీజైన నోటిఫికేషన్ కంటే.. 2024లో రిలీజ్ చేసిన ఆదేశాలే లెటెస్ట్ కాబట్టి.. దీన్నే పరిగణలోకి తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. దీన్ని బట్టే జనసేన ఇప్పుడు న్యాయపోరాటానికి దిగింది. హైకోర్టును ఆశ్రయించింది.. కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును రద్దు చేయాలని కోరుతుంది. మరి కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది..

అయితే ఇక్కడ ఇంకో తిరకాసు కూడా ఉంది. అదేంటంటే.. సీఈసీ చెప్పినట్టుగా జనసేనకు గాజు గ్లాస్ కేటాయించాం. కానీ ఇతర పార్టీలకు కేటాయించవద్దని చెప్పలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాదించే అవకాశం ఉంది. మరి అప్పుడు కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా చూడాలి. ఇన్‌ కేస్ హైకోర్టు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే మాత్రం.. కూటమి చిక్కుల్లో పడ్డట్టే.. ఎందుకంటే కూటమిలో 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంది జనసేన. ఇప్పుడు వీరందరు గాజుగ్లాస్‌ గుర్తుపైనే పోటీ చేస్తున్నారు.

అయితే కూటమి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ, బీజేపీ రెబల్ అభ్యర్థులకు కూడా గాజుగ్లాస్ దక్కడం ఇక్కడ హైలేట్.. విజయనగరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రెబల్‌గా నామినేషన్ వేసిన మీసాల గీతకు గాజుగ్లాస్.. మైలవరం స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్‌కి కూడా గాజు గ్లాస్.. విజయవాడ సెంట్రల్‌లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్..టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్.. జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర.. కావలి టీడీపీ రెబల్ సుధాకర్, పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు నంబూరు కళ్యాణ్ బాబుకి.. గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణకు.. మంగళగిరిలో రావుసుబ్రహ్మణ్యంకు.. ఇలా అనేక మందికి గాజు గ్లాస్‌ దక్కింది.

Also Read: కర్ణాటక టేప్స్.. బీజేపీ మౌనం!

ఔనన్నా.. కాదన్నా.. గ్లాస్‌ సింబల్‌ ఎఫెక్ట్‌ గట్టిగా ఉంటుందనడంలో అస్సలు డౌటే లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 30కి పైగా స్థానాల్లో జనసేన పార్టీ థర్డ్‌ ప్లేస్‌లో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో రెండో స్థానంలో కూడా ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో 30 వేలకు పైగా ఓట్లు సాధించింది. అంటే జనసేనకు కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి నియోజకవర్గాల్లోని రెబల్స్‌, ఇండిపెండెంట్స్‌కు గాజు గ్లాస్‌ గుర్తు దక్కింది. దీంతో కూటమి నేతలకు కంగారు మొదలైంది. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈవీఎంలో పేరును చూసి కాకుండా.. గుర్తును చూసి ఓటేసే వారు చాలా మందే ఉంటారని అంచనా.. గత ఎన్నికల్లో లాగానే ఈసారి కూడా గుర్తును చూసి ఓటు వేస్తే.. గణనీయంగా ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు కాస్త టెన్షన్ పెడుతుంది ఆ నేతలను.

అయితే ఇది వైసీపీ వ్యూహమన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇండిపెండెంట్లను బరిలోకి దించడం.. వారికి గాజు గ్లాస్‌ కేటాయించడం అనేది ఆ వ్యూహంలో భాగమనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో ఈవీఎంలలో గాజు గ్లాస్ సింబల్ కూడా ఉంటుంది. సో జనసేన ఓటర్లంతా గాజుగ్లాస్‌కే ఓట్లు వేస్తే మాత్రం టీడీపీ, బీజేపీ అభ్యర్థుల ఫలితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏపీ ఓటర్లకు ఆ మాత్రం తెలియదా? ఎవరు ఏ పార్టీ మనిషో కూడా గుర్తించలేరా? అనే క్వశ్చన్స్ రావొచ్చు.
అయితే అందరూ అలా ఉంటారని కాదు. కానీ కొందరు ఉన్నా కూడా అది ఫలితాలను తారుమారు చేసే అవకాశమైతే ఉంటుంది. అందుకే ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. దానిపై ఈసీ ఎలా స్పందిస్తుంది? అనే దానిపై జనసేన, కూటమి అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News