Big Stories

Walking Tips: ఎంత దూరం వాకింగ్ చేస్తే గుండెకు మంచిదో తెలుసా ?

 

- Advertisement -

Walking Tips: తరచూ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒంట్లోని బద్దకాన్ని పొగొట్టడం, బరువు తగ్గించడం, బాడీని యాక్టివ్ గా ఉంచేందుకు వాకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు శరీరంలోని రక్త ప్రసరణ, షుగర్ కంట్రోల్ వంటి వాటికి కూడా పరిష్కారం ఉంటుంది. అయితే తరచూ కొన్ని కిలోమీటర్ల మేర నడవాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. తాజాగా వాకింగ్ అనేది గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తరచూ 10వేల అడుగులు నడవడం వల్ల గుండె సంబంధింత జబ్బుల నుంచి నివారణ పొందవచ్చు.

- Advertisement -

2వేల నుంచి 10 వేల అడుగులు నడవడం వల్ల శరీరానికి సంబంధించి అనేక వ్యాధులను తరిమికొట్టవచ్చు. అయితే బిజీ లైఫ్ లీడ్ చేస్తున్న చాలా మందికి ఇలా చేయడం సాధ్యం కాదు. కానీ వారి బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యం, ఆహారంపై అశ్రద్ధ చూపుతుంటారు. అందువల్ల తరచూ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో నివసించే వారికి అందులో ఉండే లిఫ్ట్ ను వాడుతుంటారు. అయితే లిఫ్ట్ ను వాడడం కంటే తరచూ మెట్లను వాడాలిని నిపుణులు సూచిస్తున్నారు.

మెట్లు ఎక్కి దిగడం ద్వారా చాలా వరకూ వారి ఎక్సర్సైజ్ అనేది ఫినిష్ అవుతుందట. ఇంట్లో అయినా ఆఫీసులో అయినా మెట్లను వాడడం మంచిది అని సూచిస్తున్నారు. అంతేకాదు భోజనం తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. భోజనం చేశాక వెంటనే కూర్చోకుండా వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News