BigTV English

Update on Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు నుండి తప్పుకున్న క్రిష్.. మిగతా పార్ట్ కోసం రంగంలోకి కొత్త డైరెక్టర్..?

Update on Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు నుండి తప్పుకున్న క్రిష్.. మిగతా పార్ట్ కోసం రంగంలోకి కొత్త డైరెక్టర్..?

Pawan Kalyan’s ‘Hari Hara Veeramallu’ Movie Director Changed: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని AM రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గత మూడు రోజులుగా ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.


నేడు టీజర్ రిలీజ్ చేస్తూ క్రిష్ తప్పుకున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వేరే సినిమా ఉండడంతో క్రిష్ వెళ్లిపోయాడని తెలిపారు. అయితే హరి హర వీరమల్లు షూటింగ్ ఇంకొంచెం మిగిలే ఉంది. దీంతో ఆ షూటింగ్ ను ఎవరు ఫినిష్ చేస్తారు అనే అనుమానాలకు కూడా తెరపడింది. మిగతా షూటింగ్ ను AM రత్నం కొడుకు జ్యోతికృష్ణ మిగిలిన షూటింగ్ ను పూర్తిచేయనున్నాడు. సినిమా క్రెడిట్స్ లో క్రిష్, జ్యోతికృష్ణ ఇద్దరి పేరులు యాడ్ చేయనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఎలక్షన్స్ అయిన తరువాత కానీ, సెట్ లో అడుగుపెట్టడు. ఇప్పటికే క్రిష్ చాలా ఏళ్లు ఈ సినిమా కోసం వెచ్చించాడు. నిజం చెప్పాలంటే క్రిష్ తప్పుకొని మంచి పనే చేశాడు అని కొందరు అంటున్నారు. అయితే శిల్పం మొత్తాన్ని చెక్కి తుది మెరుగులు దిద్దకుండా అమ్మకానికి పెడితే బాగోదు. అలాగే సినిమాకు ప్రాణం క్లైమాక్స్. పీరియాడికల్ మూవీస్ తీయడంలో క్రిష్ సిద్ధహస్తుడు.


Also Read:Prasanna Vadanam OTT: ‘ప్రసన్న వదనం’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఇక చివర్లో ఇలా క్రిష్ వెళ్ళిపోతే.. ఒక సినిమాకు దర్శకత్వం వహించిన అనుభవంతో ఇంత పెద్ద బాధ్యతని జ్యోతికృష్ణ సరిగ్గా చేయగలడా ..? అనే అనుమానం అందరికి లేకపోలేదు. మరి హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ అయితే తప్ప ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియవు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×