Big Stories

Manifesto War In AP: అది మేనిఫెస్టో కాదు మనీ ఫీస్ట్!

Manifesto War In AP TDP Vs YCP:  ప్రజల ఆశలకు, కలలకు రాజకీయ పార్టీ ఇచ్చే రూపం మేనిఫెస్టో. తాము అధికారంలోకి రాగానే ఇవీ మేము చేసేవి.. అంటూ తమ హామీలకు అక్షరరూపమిస్తాయి పార్టీలు.. మరి ఏపీలో ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో పొలుస్తున్న పార్టీలు.. ప్రజల ముందు ఏయే హామీలు ఉంచాయి? ఇప్పటికే వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏముంది? రాబోయే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో ఏ హామీలు ఉండబోతున్నాయి?

- Advertisement -

రెండింటి మధ్య తేడాలేంటి? ప్రజలు ఎటువైపు మొగ్గు చూపే చాన్స్ ఉంది. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించింది. గతంలో అమలు చేసిన పథకాలను మరింత పెంచింది. రైతు భరోసా, వృద్ధాప్య, దివ్యాంగుల పెన్షన్లు.. అమ్మ ఒడి, మహిళ, చేనేతలకు, మత్స్యకారులకు చేయూత పథకాలు.. పెళ్లికానుకలు.. ఇలా ప్రతి పథకంలోనూ ఆర్థిక సాయాన్ని పెంచుతూ పోయింది వైసీపీ.. సింపుల్‌గా చెప్పాలంటే నవరత్నాలకు మరింత మెరుగుపెట్టి.. అంతకుమించి అనేట్టుగా మేనిఫెస్టోను డిజైన్ చేసింది వైసీపీ.. ఇది వైసీపీ మేనిఫెస్టో.

- Advertisement -

ఇక కూటమి నేతలు ఉమ్మడిగా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.. అయితే ఇందులో వైసీపీని మించి హామీలు ఉండబోతున్నాయి. ఇప్పటికే వైసీపీని మించి తమ సంక్షేమం ఉంటుందని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు.. ఇప్పటికే సూపర్ సిక్స్‌ను అనౌన్స్‌ కూడా చేశారు.. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో.. టీడీపీ సూపర్ సిక్స్‌కు కంపారింగ్ మొదలైంది. రైతులకు వైసీపీ రైతు భరోసా కింద 16 వేల 500 ఇస్తామంటే.. ఇదే పథకాన్ని అన్నదాత పేరుతో 20 వేలు అందిస్తామంటోంది టీడీపీ.. కౌలు రైతులకు కూడా ఇదే అందనుంది. ఇక వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కూడా ఇంటే.. ప్రస్తుతం అందుతున్న 3 వేల పెన్షన్‌.. 2029 వరకు 3 వేల 500కు పెంచుతామని వైసీపీ చెబుతుంది.

Also Read: ఏపీలో పార్టీ గుర్తుల రచ్చ, కోర్టుకు జనసేన..

అయితే టీడీపీ మాత్రం 2024 జూన్ నుంచే 4 వేలు రూపాయలు ఇస్తామంటోంది.. అంతేకాదు దివ్యాంగులకు 6 వేల ఆర్థిక సాయం చేస్తామంటోంది. ఇక అమ్మ ఒడి విషయంలో కూడా ఇదే కనిపిస్తుంది.. వైసీపీ 17 వేలు ఇస్తామంటుంటే.. టీడీపీ తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి 15 వేలు ఇస్తామంటోంది.. ఎంత మంది పిల్లలు ఉన్నా ఇది వర్తిస్తుందని చెబుతుంది టీడీపీ.. పెళ్లి కానుక కింద వైసీపీ 50 వేలు ఇస్తామంటే.. టీడీపీ లక్ష రూపాయలు ఇస్తామంటోంది.

ఇవీ కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. దీపం పథకం కింద మూడు గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు.. 40 లక్షల ఇళ్ల నిర్మాణం.. అన్న క్యాంటిన్లతో 15 రూపాయలతో మూడు పూటల భోజనంతో పాటు.. మొదటి సంతకం డీఎస్సీపైనే పెడతామంటోంది టీడీపీ. ఇవీ కాస్త డిటెయిల్డ్‌గా రెండు పార్టీలు ఇచ్చిన హామీలు.. వీటితో పాటు మరిన్ని హామీలు కూడా ఉండనున్నాయి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో.. సో ఏపీలో ఎవరు గెలిచినా ప్రతి నెల ఒకటో తేదీనే డబ్బులు నడుచుకుంటూ రావడం ఖాయం.

ఎందుకంటే ఎవరు గెలిచిన డబ్బుల వర్షం కురుస్తుంది ప్రజలపై.. కానీ ఇక్కడే ఒక డౌట్ ఉంది. ఈ హామీలను ఎంత మేరు అమలు చేస్తాయి పార్టీలు ? ఈ హామీలను అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థపై పడే భారం ఎంత? దీనిపై మాత్రం ఏ పార్టీ కూడా నోరు మెదపడం లేదు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పార్టీల పాలనను చూశారు ఏపీ ప్రజలు.. అటు చంద్రబాబు కావచ్చు.. ఇటు జగన్‌ మోహన్ రెడ్డి కావచ్చు. ఇద్దరి పాలన తీరు ప్రజలకు తెలుసు. 2014లో ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు ఎంత మేర అమలు చేశారు. 2019లో వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోను జగన్‌ ఎంత మేర అమలు చేశారనే దానిపై చర్చ నడుస్తుంది. అయితే తాము ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామంటోంది వైసీపీ.

Also Read: జగన్ వైఎస్సార్ వారసుడా ? లేక కేంద్రానికి వారసుడా ? : షర్మిల ఫైర్

టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయడం కుదరదంటున్నారు జగన్.. అయితే జగన్ చెప్తున్నట్టు హామీల అమలు 99 శాతం జరగలేదంటున్నారు చంద్రబాబు. నిజానికి దేశం మొత్తం రాజకీయం ఒకలా ఉంటే.. ఏపీలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ నేతలు మాటలతోనే నేతలు మంటలు పుట్టిస్తారు. రాజకీయ నేతలు మాట్లాడే మాటలపై డిబెట్లు ఎక్కువ జరుగుతాయి.

ఇప్పటికే మేనిఫెస్టోపై జోరుగా చర్చ నడుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇరు పార్టీల మధ్య యుద్ధమే జరుగుతుంది. కామెంట్స్ వార్ కంటిన్యూ అవుతుంది. ఎవరి మాటలు ఎలా ఉన్నా.. ఎవరెన్ని విమర్శలు చేసుకున్నా.. ఒకటి మాత్రం నిజం.. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా పంచుడు ప్రొగ్రామ్‌ మాత్రం కన్ఫామ్.. ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చేలోపు రాష్ట్ర ఖజానాపై భారం పడటం ఖాయం. ఇప్పుడిదే అంశంపై ఏపీలో చర్చ జరుగుతుంది. మరి ప్రజలు ఎటువైపు మొగ్గుతారు? ఎవరికి ఓటేస్తారు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News