Big Stories

KTR Comments On Hyderabad: కేటీఆర్ నోట.. యూటీ పాట..

KTR Comments On Hyderabad: హైదరాబాద్‌.. తెలంగాణ మణిహారం.. రాష్ట్రానికి రాజధాని. అలాంటి హైదరాబాద్‌ మనకు కాకుండా పోతుందా? హైదరాబాద్‌ను కేంద్రం కేంద్ర పాలిత ప్రాంతం చేయనుందా? ఏంటీ ఈ పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? ఇది నాకు వచ్చిన అనుమానం కాదు. స్వయానా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ చెబుతున్న మాట.. అదేంటో మీరు వినేయండి. అదండి విషయం. జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణకు రాజధాని. ఆ తరువాత కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ఎంపీలు గెలిస్తేనే ఇలాంటివి అడ్డుకునే అవకాశం ఉంటుంది. లేదంటే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై మన హైదరాబాద్‌ను మనకు కాకుండా చేసేస్తారు. అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్నారు కేటీఆర్. మరి ఇది నిజంగా నిజమా? మన హైదరాబాద్‌ మనకు కాకుండా పోతుందా?

- Advertisement -

కేటీఆర్ స్టేట్‌మెంట్.. ఎన్నికలు.. ఈ రెండింటికి సంబంధం ఉంది. కాస్త వెనక్కి వెళ్లండి.. గతంలో కేటీఆర్‌ మాత్రమే కాదు. బీఆర్‌ఎస్ పెద్దలంతా ఇలాంటి స్టేట్‌మెంట్సే ఇచ్చేవారు. బీఆర్ఎస్‌ గెలవకపోతే సీమాంధ్ర పాలకులు మళ్లీ పెత్తనం చెలాయిస్తారు. బీఆర్‌ఎస్ గెలవకపోతే రాష్ట్రం సాధించుకున్నది వృధా అయిపోతుంది. అసలు బీఆర్ఎస్‌ లేకపోతే తెలంగాణానే లేదు. అనేలా ఉండేవి బీఆర్ఎస్‌ నేతల స్టేట్‌మెంట్స్‌. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి సెంటిమెంట్‌ను రాజేయడం బీఆర్ఎస్‌కు కొత్తేం కాదన్నది మనకు తెలిసిందే. సపోజ్.. ఫర్ సపోజ్.. కేటీఆర్ చెప్పిందే కాసేపు నిజమనుకుందాం.

- Advertisement -

Also Read: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి..

ఏపీ పునర్వ్యవస్థీకరణ సమయంలో హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ ఆ తర్వాత హైదరాబాద్ ను రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు.. పదేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ గడువు 2024 జూన్‌తో ముగుస్తుంది. గత ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రచారం జరిగింది. ఇదే కేసీఆర్‌కు కాస్త ప్లస్‌ కూడా అయ్యింది. అప్పుడు మోడీ సర్కార్ యూటీకి సానుకూలంగా ఉందంటూ తెగ చర్చ నడిచింది. కానీ ఏమైంది.. ఆ తర్వాత ఇదంతా ఎన్నికల స్టంట్ అని తేలిపోయింది. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇదే చర్చ మొదలైంది. అది కూడా సరిగ్గా ఎన్నికల ముందు. బీఆర్ఎస్ నేతలు ఈ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. కానీ ఈసారి అలా జరిగే చాన్సుందా? దీనికి ఆన్సర్ నో అనే చెప్పాలి. రాజకీయంగా అవసరమైనప్పుడల్లా యూటీ అంశం తెరపైకి వస్తుందే తప్ప.. ఆ తర్వాత కనుమరుగైపోతుంది.. ఈసారి కూడా అదే జరుగుతుంది.

అసలు హైదరాబాద్‌ను ఎందుకు యూటీ చేయాలి? ఎవరికి అవసరం? ఎవరికి లాభం? ఔను ఇదే క్వశ్చన్ కదా ఇప్పుడు మనం వేసుకోవాల్సింది. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఎవరికి లాభం? ఎవరికి లేదు. హైదరాబాద్ అంటే తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ ఆర్థిక స్థితికి ఆయువు పట్టు. అలాంటి హైదరాబాద్‌కు వ్యతిరేకంగా ఏ చిన్న స్టేట్‌మెంట్ కేంద్రం అధికారికంగా చేసినా రాష్ట్రంలో మరో పోరాటం తప్పదు. ఇది కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు మరింత ఎదిగేందుకు కారణమవుతుంది. మరి బీజేపీ ఆ చాన్స్‌ తీసుకుంటుందా? అస్సలు తీసుకోదు. దీనికి తోడు తెలంగాణ గడ్డపై ఏ రోజుకైనా కాషాయ జెండా పాతాలనేది కమలనాథుల ఆలోచన. అలాంటి వారు హైదరాబాద్‌ను యూటీ చేసి తెలంగాణ ప్రజల కోపానికి కారణమవుతారా?

Also Read: హైదరాబాద్ పబ్‌లో ఘర్షణ, కత్తితో దాడి.. నలుగురు..

కేటీఆర్‌ చేసేది పక్కా ఎన్నికల స్టంట్‌ అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. నిజానికి బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఏపీలో మండలాలను కలిపినప్పుడే ఎందుకు పోరాటం చేయలేదు. ఇది కూడా వారడిగిన ప్రశ్ననే.. యూటీపై వాదోపవాదనలు ఇలా ఉంటే.. కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో మరో కొత్త, ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటో కూడా చూసేయండి.

ఇది ఎలా సాధ్యం? 10 నుంచి 12 మంది ఎంపీలను గెలిపిస్తే.. కేసీఆర్ ఒక్క ఏడాదితో రాష్ట్ర రాజకీయాలను ఎలా శాసిస్తారు? ఇదే మెయిన్ క్వశ్చన్.. అంటే మళ్లీ బీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ చెప్పకనే చెబుతున్నారా? అదే నిజమైతే ఎన్నికలు కూడా లేవు కదా. అధికారాన్ని ఎలా దక్కించుకుంటారు? ఇదే ఇప్పుడు పెద్ద మిస్టరీ..కేటీఆర్ చెప్పేది సాధ్యం కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరాలి. గతంలో ఒకసారి ఇలాంటి కామెంట్స్‌ చేస్తేనే ఉన్న పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా ఈ పాతరాగాన్ని మాత్రం మరవడం లేదు కేటీఆర్.. మరి ఈ అస్త్రమైన ప్రజలపై పనిచేస్తుందా? సెంటిమెంట్‌కు ప్రజలు పడిపోతారా? అంటే ప్రజలు ఇంకా పాత విధానంలోనే ఆలోచిస్తున్నారని భావిస్తున్న బీఆర్ఎస్‌ నేతలు తప్పుడు లెక్కలు వేస్తున్నట్టే.. కానీ ఒక విషయాన్నైతే కేటీఆర్ తెలుసుకున్నారు.. ఎందుకు ఓడిపోయామో చెప్పేశారు.

అంటే బీఆర్ఎస్‌లో నేతల మధ్య సయోధ్య ఇప్పటికీ లేనట్టే అని చెప్పకనే చెప్పారు కేటీఆర్.. మరి ఆ సయోధ్య కుదురుతుందా? నేతలు కలిసి పనిచేస్తారా? లేక ప్రజలు పార్టీని నమ్మడం లేదని.. తలోదారి చూసుకుంటారా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News