Big Stories

BJP Strategies : బీజేపీ ప్రచారాస్త్రాలు వర్కౌట్ అవుతాయా?

- Advertisement -

తాను స్ట్రైక్స్‌ నిర్వహించగానే.. ప్రెస్‌ కంటే ముందు పాకిస్థాన్‌కు ఇన్ఫామ్ చేశానన్నారు. అంతా బానే ఉంది కానీ.. ఇది ఏదో మాములుగా గుర్తొచ్చి చెప్పినట్టుగా కనిపించడం లేదన్నది ఇప్పుడు విపక్షాల ఆరోపణ. తాము చేసిన పనులను కావాలనే ప్రజలకు గుర్తు చేసి ఓట్లు దక్కించుకునే ప్లాన్‌లా కనిపిస్తుంది అంటూ విమర్శలు మొదలయ్యాయి. నిజానికి మోడీ రెండోసారి అధికారంలోకి రావడానికి ఈ ఎయిర్‌స్ట్రైక్స్‌ చాలా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. కానీ ఈసారి అలాంటివేం లేవు.. అందుకే ఈ అంశాలను మోడీ తెరపైకి తీసుకొస్తున్నారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

ఇదొక్కటే కాదు.. ఇప్పుడు ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.. రీసెంట్‌గా అమెరికన్ మీడియా ఓ సంచలన వార్తను పబ్లిష్ చేసింది. అదేంటంటే కెనడా ఉండి భారత్‌పై విద్వేషం చిమ్ముతున్న ఖలీస్థాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్‌ పన్నును హత్య చేసేందుకు రీసెర్చ్ అండ్ అనాలసిస్‌ వింగ్‌ ఏజెంట్ కుట్ర పన్నాడని ప్రకటించాయి. ఇందులో ఆ రా ఏజెంట్ పేరు విక్రమ్ యాదవ్‌ అని కూడా తెలిపాయి. మరి ఈ డాక్యుమెంట్స్ ఎలా బయటికి వచ్చాయన్నది అక్కడి మీడియా ప్రకటించలేదు. విక్రమ్ అన్ని డిటెయిల్స్ సేకరించాడని.. ఓ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశాడని.. ఆ సమయంలో రా చీఫ్‌గా ఉన్న సామంత్ గోయేల్ కూడా దీనికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడని ఆ కథనం చెబుతోంది. అంతేకాదు ఈ విషయం నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ అజిత్ ధోవల్‌కు కూడా తెలిసే ఉంటుందన్న తెలిపాయి. ఇప్పుడీ కథనం ఇండియాలో ఓ ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. అయితే కేంద్రం దీనిని కొట్టిపడేసింది.. ఊహాజనిత కథనం అంటూ కౌంటర్ ఇచ్చింది.

Also Read: లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 45 మందికి గాయాలు

ఇప్పుడు మరో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం.. పాకిస్థాన్‌లో కీలకమైన ఉగ్రవాద నేతలు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. వారిని ఎవరు చంపుతున్నారో.. ఎందుకు చంపుతున్నారో తెలియడం లేదు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై రావడం.. ఎక్కడో నక్కి ఉన్న ఉగ్రవాదులను కాల్చి చంపడం తర్వాత మళ్లీ ఆచూకి కూడా దొరక్కుండా పారిపోవడం. గత కొన్ని రోజులుగా ఇది జరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు 20 మందికిపైగా కీలక ఉగ్ర నేతలు ఇలానే చనిపోయారు. పాక్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు.

ప్రస్తుతం ఈ రెండు విషయాలపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది తెలియకపోయినా ఇవి ఇండియాకు మాత్రం గుడ్‌ న్యూసే.. ఎట్ ది సేమ్ టైమ్.. ప్రధాని మోడీ ఈ మధ్య కీలకవ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఎవరు ఏ పనులు చేసినా.. వారి ఇంట్లోకి వెళ్లి హతమారుస్తామని ఇప్పుడు ఆయన చెప్పే డైలాగ్స్‌కు.. అక్కడ జరిగే పనులకు లింక్ చేస్తూ బీజేపీ ప్రచారం చేస్తోంది. సో ఇన్‌డైరెక్ట్‌గా ఈ పనులు చేసింది తామే అని క్లెయిమ్‌ చేసుకుంటోంది అధికార పార్టీ.. కానీ అధికారికంగా మాత్రం ఈ విషయాలపై మౌనమే సమాధానమవుతుంది.

ఇది అంతర్జాతీయ విషయాలు. ఇక నేషనల్ టాపిక్స్‌ విషయానికి వస్తే.. ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా హాట్‌ టాపిక్ రిజర్వేషన్స్.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న బీజేపీ పెద్దలు.. ఇప్పుడు కొత్త మాట ఎత్తుకున్నారు. ఎప్పుడైతే అమిత్ షా ఎడిట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందో ఆ వీడియోను చూపిస్తూ ఇది కాంగ్రెస్ కుట్రే అంటున్నారు. అంతేకాదు.. తాము రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఎక్కడ చెప్పాం? ఎప్పుడు చెప్పాం? అంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు.

తాము రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. మోడీ కూడా ఎక్కడా చెప్పలేదు.. రిజర్వేషన్లను మేం మొదటి నుంచి మద్దతిస్తున్నామని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని మొదటే ఎందుకు చెప్పలేదు. కావాలనే చాలా రోజులు పాటు ఆగి.. ఈ స్టేట్‌మెంట్‌ చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఫేక్‌ వీడియోను బేస్‌ చేసుకొని కాంగ్రెస్‌పై బద్నాం గేమ్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. ఓవరాల్‌గా చూస్తే బీజేపీ ప్రచారం తమ పాలన గతమెంతో ఘన కీర్తి అన్నట్టుగానే ప్రచారం చేసుకుంటున్నట్టుగా సాగుతోంది. మరి బీజేపీ ప్రచార ఎత్తులు ఎంత వరకు ప్రజల మనసులు గెలుచుకుంటాయన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News