BigTV English
Advertisement

Rinku out from T20 World Cup 2024: రింకూ సింగ్‌‌ను అందుకే ఎంపిక చేయలేదా? లెఫ్ట్ హ్యాండర్ కావడమే కారణమా?

Rinku out from T20 World Cup 2024: రింకూ సింగ్‌‌ను అందుకే ఎంపిక చేయలేదా? లెఫ్ట్ హ్యాండర్ కావడమే కారణమా?

Reason for Rinku Singh Exclusion from Team Indian Squad for T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో జట్టు కూర్పుపై మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా రింకూ సింగ్ విషయంలో బీసీసీఐపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఓవరాల్ గా ఇదొక చెత్త జట్టు అని కూడా కొందరు తేల్చి పారేస్తున్నాడు. కొందరేమో ఎందుకలా జరిగిందని రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అవేమిటో ఒకసారి చూద్దాం.


ఎంపిక చేసిన జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల కూడా తనని పక్కన పెట్టి ఉండవచ్చునని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎందుకంటే ఓపెనర్లుగా వెళితే రోహిత్ ఉంటాడు. తనతో పాటు మరో ఓపెనర్ గా లెఫ్ట్ హ్యాండర్ యశస్వి వస్తాడు. తర్వాత ఫస్ట్ డౌన్ కొహ్లీ వస్తాడు.

సెకండ్ డౌన్ సూర్యకుమార్ వస్తాడు. వీరిద్దరి తర్వాత ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు రిషబ్ పంత్, శివమ్ దూబె వస్తారు. వీరి తర్వాత కూడా వస్తే రింకూ సింగ్ రావాలి. తను కూడా లెఫ్ట్ హ్యాండర్ కావడంతో అవకాశం దక్కి ఉండకపోవచ్చునని విశ్లేషిస్తున్నారు.


Also Read: ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. వన్డే, టీ20ల్లో టీమిండియా నెంబర్ 1.. కానీ..!

జట్టులో ఆల్ రౌండర్లు లేకపోవడం కూడా రింకూ సింగ్ ఎంపికపై ప్రభావం పడింది. మరోవైపు శివమ్ దూబె బౌలింగ్ కూడా చేస్తాడు. అంటే రెగ్యులర్ బౌలింగ్ లో వికెట్లు పడనప్పుడు స్టాండ్ బై గా ఆల్ రౌండర్లు ఉంటే, కెప్టెన్ కి ఆప్షన్లు ఎక్కువగా ఉంటాయి. రొటీన్ బౌలింగ్ ని మార్చి వీరికి అవకాశం ఇస్తాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమికి ఇది కూడా ఒక కారణంగా చెప్పాలి.

రెగ్యులర్ బౌలర్లకి ఒక దశలో వికెట్లు పడలేదు. అప్పుడు హార్దిక్ పాండ్యా అందరికీ గుర్తుకు వచ్చాడు. ఇలాంటి పరిస్థితులు వస్తే అనే ఉద్దేశంతో శివమ్ దూబెకి అవకాశం కల్పించారని అంటున్నారు. ఇకపోతే రింకూ సింగ్ కేవలం స్టాండర్ట్ బ్యాటర్ కావడం తనకి శాపంగా మారింది. అయితే టీ 20ల్లో రవీంద్ర జడేజా పెద్ద ఆల్ రౌండర్ కాదు. అలాగే హార్దిక్ పాండ్యాపై కూడా పూర్తిగా ఆధారపడలేమని చెబుతున్నారు.వీరిద్దరి బదులు రింకూని సెలక్ట్ చేసి ఉండవచ్చు కదా అనే వాదనలు వినిపించాయి.

Also Read: ఎవరి కోసం రింకూని బలి చేశారు? ఇదో చెత్త సెలక్షన్: సీనియర్లు సీరియస్

టాప్ ఆర్డర్ సిక్స్ లో సరైన ఆల్ రౌండర్ లేక రింకూ బలయ్యాడని లెక్కలు తేల్చుతున్నారు. కాకపోతే రింకూ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. నలుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేశారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఇంతమంది ఎందుకని కూడా అంటున్నారు.

మరోవైపు మరో వివాదం తెరమీదకు వచ్చింది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ను కనీసం రిజర్వ్ బెంచ్ ఆటగాడిగానైనా తీసుకువెళ్లాల్సింది. తను ఇరగదీస్తున్నాడని అంటున్నారు. శుభ్ మన్ గిల్ ఫెయిల్ అవుతుంటే, తనని తీసుకువెళ్లడంలో అర్థం లేదని తేల్చేస్తున్నారు. మొత్తమ్మీద జట్టు కూర్పుపై ఎవరూ పెద్దగా సంత్రప్తిగా లేరని అంటున్నారు.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×