Big Stories

Amit Shah Video Morphing: డీప్ ట్రబుల్.. వైరల్ గా అమిత్ షా ఎడిట్ వీడియో

- Advertisement -

అమిత్‌ షా మాట్లాడింది ఏప్రిల్ 25న.. కానీ ఈ విషయం 29 వరకు హైలేట్ కాలేదు. తెలంగాణ బీజేపీ నేతలు దీనిపై మౌనంగా ఉన్నారు. కానీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. దీంతో దేశవ్యాప్తంగా పది మందికి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ స్పెషల్ సెల్ నోటీసులు.. 28వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వెంటనే నోటీసులు జారీ అయ్యారు. నోటీసులు జారీ చేసిన పది మందిలో నలుగురు తెలంగాణ వారే ఉండటం ఇక్కడ హైలేట్.. మన్నే సతీష్‌, నవీన్, శివకుమార్, తస్లీమా.. వీరే తెలంగాణలో ఢిల్లీ పోలీసుల నోటీసులు అందుకున్న నలుగురు నేతలు.. వీరందరికి 91/160 CRPC కింద నోటీసులు ఇచ్చారు.

- Advertisement -

Also Read: కేజ్రీవాల్ పై సుకేశ్ రైమ్స్.. మండోలి జైలు నుంచి మరో లేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు. ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరవ్వాల్సిందే.. అంటూ నేషనల్ మీడియాలో వార్తలు ప్రారంభమయ్యాయి. సోర్సెస్‌ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ అంటూ ఈ టాపిక్‌ను హైలేట్ చేశారు. తెలుగు మీడియా కూడా ఇదే ప్రచారాన్ని ప్రారంభించింది. కానీ తీరా చూస్తే అసలు నోటీసులు ఇచ్చిన వారిలో రేవంత్ రెడ్డి పేరు లేనే లేదు. మరి ఎందుకిలా జరిగింది? ఇది అనుకోకుండా జరిగిందా? లేక కావాలనే ఈ పేరును హైలేట్ చేశారా? అనేది తేలాలి. గత కొన్ని రోజులుగా రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై రేవంత్ నిప్పులు చెరుగుతున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నేషనల్ మీడియాకు కూడా ఇదే టాపిక్‌పై ఇంటర్వ్యూస్‌ ఇస్తున్నారు. దీంతో కావాలనే రేవంత్‌ను బీజేపీ పెద్దలు టార్గెట్‌ చేశారా? అనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.. సీఎం రేవంత్ కూడా ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు.

ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల స్విఫ్ట్‌ రియాక్షన్ అనేది ఇక్కడ కాస్త ఇంట్రెస్టింగ్ పరిచయం. నిన్న సాయంత్రం ఢిల్లీలో FIR నమోదైతే.. 24 గంటలు గడవక ముందే.. దేశవ్యాప్తంగా 10 మందిని గుర్తించి. ఆయా రాష్ట్రాలకు వెళ్లి నోటీసులు కూడా అందించారు. ఇక ఈ కేనులో నమోదు చేసిన సెక్షన్స్ చూస్తే అర్థమయ్యే మరో విషయం ఏంటంటే.. ఏ కేసులో కూడా ఏడేళ్లకు మించిన జైలు శిక్ష లేదు. ఎట్ ది సేమ్‌ టైమ్.. చాలా సెక్షన్స్‌ జస్ట్‌ ఫైన్ వేసి వదిలేసేవి మాత్రమే. మరి ఇలాంటి ఇష్యూకు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు?

Also Read: ఎన్నికల బరి నుంచి తప్పుకున్న ప్రియాంక గాంధీ.. అక్కడి నుంచి రాహుల్ పోటీ ?

ప్రస్తుతం కర్ణాటకలో ప్రజ్వల్‌ సెక్స్‌ టేప్స్‌ అంశం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నోటీసులు వచ్చే సమయానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ప్రియాంక గాంధీతో పాటు అనేక కాంగ్రెస్‌ పెద్దలంతా అక్కడే ఉన్నారు. ఇలాంటి సమయంలో నోటీసులు ఇస్తున్నారంటూ ముందుగా లీక్‌లు రావడం. అందులో రేవంత్ పేరును కూడా చేర్చడం లాంటివన్ని చూస్తుంటే.. ఇదంతా ఆ ఇష్యూను డైవర్ట్ చేసే వ్యూహాంలో భాగమా అనే డౌట్ ఉంది. ఎట్ ది సేమ్ టైమ్. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల రద్దుపై జరుగుతున్న చర్చను కూడా డైవర్ట్ చేసే ఉద్దేశం కూడా ఉండొచ్చన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మీరు జోస్యం అనుకోండి.. మరేదైనా అనుకోండి. ఈ కేసులో జరిగే విషయాలు ముందే గేస్ చేద్దాం.

ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు ఈ వీడియోలను షేర్ చేశారు.. నిజమే.. కానీ అవన్నీ ఫలానా న్యూస్‌ చానల్స్‌ టెలికాస్ట్ చేసిన వీడియోలు లేదంటే వాటి పేరుతో వచ్చిన ఎడిటెట్ వీడియోలు.. రేపు విచారణలో కూడా ఇదే విషయాన్ని పోలీసులకు చెబుతారు పార్టీల సోషల్ మీడియా ఇంచార్జ్‌లు.. అప్పుడు వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ ప్రారంభమవుతుంది. కానీ ఇదంతా జరిగే లోపు ఎన్నికలు ముగుస్తాయి.. కానీ ఆ లోపు మీడియాలో మాత్రం కాంగ్రెస్‌ నేతలు విచారణకు హాజరు. అమిత్‌ షా ఫేక్‌ వీడియోలు వైరల్ చేసిన కాంగ్రెస్ నేతలు.. దానికి బీజేపీ రియాక్షన్స్.. కాంగ్రెస్‌ కౌంటర్స్.. ఇవే తప్ప మరేం కనిపించదు.. ఇది మాత్రం ఫ్యాక్ట్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News