Big Stories

Priyanka Gandhi Get Emotional: ప్రియాంక గాంధీ భావోద్వేగం.. అందుకేనా?

Priyanka Gandhi Emotional Speech in Chhattisgarh Kobra: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి రాజీవ్ గాంధీ అమరత్వాన్ని ప్రజలకు గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కోర్భా నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ప్రజల గుండెల నుంచి తమ మీదున్న ప్రేమను మాత్రం ఎవరూ చెరిపివేయలేరని అన్నారు.

- Advertisement -

ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. “చిన్న తనంలో మా తండ్రి రాజీవ్ గాంధీ డెడ్ బాడీ ముక్కలు తెచ్చినప్పుడు.. ఈ దేశంపై చాలా కోపమొచ్చింది. నేను మా నాన్నను క్షేమంగా మీ దగ్గరకు పంపాను. కానీ మీరు ఆయనను ముక్కలుగా తిప్పి పంపారు. కానీ తర్వాత అర్థమైంది.. బలిదానం అంటే ఏంటో. ఇప్పుడు బలిదానం అంటే ఏంటో నాకు తెలుసు.

- Advertisement -

Also Read:హిందూ సమాజాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: పీఎం మోదీ

మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చింది సంపద కాదు బలిదానం స్ఫూర్తి. మీరు మీ కొడుకులను సరిహద్దుకు పంపినందున మీరు ఈ అనుభూతిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సెంటిమెంట్‌ను ప్రధాని మోదీ అర్ధంచేసుకోలేకపోతున్నారు. దేశద్రోహులంటున్నారు. మమ్మల్ని సభ నుంచి పంపించవచ్చ.. పార్లమెంట్ నుంచి తరిమేయవచ్చు.. కానీ ప్రజల గుండెల నుంచి ఈ భావాన్ని ఎవరూ తొలగించలేరు” అని భావోద్వేగానికి గురయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News