Big Stories

Lungs : ఊపిరితిత్తులపై కోవిడ్ ఎఫెక్ట్.. స్కానింగ్‌తో వెల్లడి..

Lungs

Lungs : కోవిడ్ అనేది ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళిని అంతా కుదిపేసింది. చాలామంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు కలిసి వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టడం వల్ల కోవిడ్‌కు వ్యాక్సిన్ లభించింది. అప్పటినుండి ఇప్పటివరకు ఇంకా కోవిడ్‌పై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దీనిపై చేసిన పరిశోధనల్లో ఓ షాకింగ్ విషయం బయటపడింది.

- Advertisement -

కోవిడ్ 19 అనేది ముందుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపించి.. ఆపై మనిషికి శ్వాస విషయంలో ఇబ్బంది కలిగించేది. ఊపిరితిత్తులలో ఎలాంటి సమస్య లేనివారు కోవిడ్‌ను ఎదిరించి బతికి బయటపడ్డారు. కానీ శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. అందుకే అప్పటినుండి ఊపిరితిత్తులపై కోవిడ్ ప్రభావం గురించి పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

- Advertisement -

కరోనా నుండి బయటపడి కోలుకున్న వారిలో కూడా ఇంకా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయని.. చెస్ట్ సీటీ ద్వారా వైద్యులు కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 మిలియన్ ప్రజలు కోవిడ్ నుండి బయటపడ్డారు. కానీ దాని వల్ల ఊపిరితిత్తులపై పడిన ఎఫెక్ట్ జీవితాంతం ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఊపిరితిత్తులతో పాటు మరికొన్ని శరీర భాగాలు కూడా కోవిడ్ వల్ల జరిగిన ఎఫెక్ట్‌ను భరించాల్సి ఉంటుందని తెలిపారు. కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల ఫంక్షన్‌లో వచ్చే మార్పులపై వారు దృష్టిపెట్టారు.

2020లో జనవరి నుండి మార్చ్ మధ్యలో కోవిడ్ నుండి బయటపడిన 144 పేషెంట్లను చైనా శాస్త్రవేత్తలు స్టడీ చేశారు. వారికి ఆరో నెలలో ఒకసారి, 12వ నెలలో ఒకసారి, రెండేళ్ల తర్వాత ఒకసారి చెస్ట్ సీటీ స్కాన్‌ను చేశారు. ఈ స్కానింగ్‌లో వారు ఊపిరితిత్తులలో వచ్చిన మార్పులను గమనించారు. ఫబ్రోసిస్‌తో పాటు ఎన్నో ఇతర సమస్యలను వారు ఈ పేషెంట్ల ఊపిరితిత్తులలో గుర్తించారు. కానీ స్కానింగ్ జరిగిన ప్రతీసారి దీని ఎఫెక్ట్ కొంచెంకొంచెంగా తగ్గుతున్నట్టుగా వారు తెలిపారు.

ఈ లంగ్స్ సమస్యలను కూడా వారు కొందరిలోనే గుర్తించారని వైద్యులు బయటపెట్టారు. ముందు నుండి ఊపిరితిత్తులలో ఏదైనా సమస్య ఉన్నవారికే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా వారు గుర్తించారు. మిగతావారిలో ఆ ఎఫెక్ట్ రెండేళ్లలో 32 శాతం 20 శాతం తగ్గినట్టుగా తెలిపారు. అందుకే కోవిడ్ నుండి బయటపడినా కూడా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News