Big Stories

CM Revanth comments AP Politics: ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్.. కేసీఆర్ ఇంకా..

CM Revanth comments on AP Politics(Political news telugu): ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. పొరుగునున్న తెలంగాణతోపాటు విదేశాల్లోనూ ఏపీ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒకరు రాజకీయ సీనియర్ నేత చంద్రబాబు అయితే.. మరొకరు జగన్. ఎన్నికల సీజన్ కావడంతో అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణలోని ప్రజలు, రాజకీయ నేతలు దృష్టిపెడతారు. అధికార కాంగ్రెస్ నేతలు, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఏపీ రాజకీయాల గురించి వాకబు చేస్తుంటారు.

- Advertisement -

ఈసారి గెలుపు ఎవరిది? అధికార వైసీపీదా లేక టీడీపీ ఆధ్వర్యంలో కూటమి విజయం సాధిస్తుందా? అన్నదానిపై ఎవరివారు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ విషయంలో గులాబీ బాస్ కేసీఆర్, తన మిత్రుడి జగన్‌కు ఎడ్జ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. దానిపై కౌంటర్లు కూడా పడిపోయాయి. ఆ విషయాన్ని పక్కన బెడితే ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి నోరు విప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

- Advertisement -

ఓ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఏపీ రాజకీయాలపై ప్రధానంగా మాట్లాడారు సీఎం రేవంత్‌‌రెడ్డి. ఎక్కడైనా అధికార ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని కుండబద్దలు కొట్టేశారు. షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్నింగ్స్ మొదలుపెట్టిందన్నారు. ఏపీ రాజకీయాల్లో తమ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఈసారి అక్కడ అన్ని సీట్లలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. మా దృష్టంతా కాంగ్రెస్‌కు అనుకూలమైన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడంపైనే ఉందన్నారు.

షర్మిల చీర గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం మాట్లాడారు. సొంత చెల్లెలనే కాదు.. ఇతర ఆడపిల్లల గురించి జాగ్రత్తగా మాట్లాడడం మంచిదన్నది తన ఒపీనియన్‌గా చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ గెలుస్తున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉండే ద్వేషంతోనే ఆయన అలా మాట్లాడి ఉండవచ్చన్నారు. ముఖ్యంగా కేసీఆర్-జగన్ మధ్య అవగాహన గురించి అందరికీ తెల్సిందేనని, ఓ కేసులో చంద్రబాబు అరెస్టును ఆయన సమర్థించారని గుర్తుచేశారు.

ALSO READ: విభజన హామీలపై క్లారిటీ ఇచ్చాకే.. మోదీ రాష్ట్రానికి రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

అంతేగానీ ఏపీలో గెలుపు ఎవరిది అనే విషయంపై కనీసం మాట కూడా మాట్లాడలేదు సీఎం రేవంత్‌రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ ఇంటర్వ్యూ‌పై తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యనేతలు చర్చించుకోవడం మొదలైంది. రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు సీఎం రేవంత్‌లో పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు పలువురు నేతలు. సీఎం రేవంత్‌రెడ్డికి- కేసీఆర్‌కి అదే తేడా అని నేతలు చర్చించుకోవడం కొసమెరుపు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News