Big Stories

6th Phase Elections : ఆరో విడత సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

6th Phase Loksabha Elections : ఆరో విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరోవిడత లోక్ సభ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ విడతలో బిహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 6 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్ సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది.

- Advertisement -

అభ్యర్థులు మే 6వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. మే 7న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మే 9తో ముగుస్తుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ 7 దశల్లో జరిగే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడుతాయి. ఇప్పటికి 2 దశల్లో లోక్ సభ, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో తొలిదశ పోలింగ్ జరగగా.. 62 శాతంకు పైగా ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్ 26న జరిగిన రెండో దశ ఎన్నికలు జరిగాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News