Big Stories

First Credit Card: మొదటి క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తున్నారా..? ప్రభావాలు.. ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకోండి!

Closing your First Credit Card: చాలా మందికి నేడు ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. వీటి కారణంగా జీవితానికి మించి ఖర్చు చేస్తున్నప్పుడు ఏదైన ఒకదానిని క్లోజ్ చేయాలని చూస్తుంటారు. మీరు గమనిస్తే చివరగా తీసుకున్నదానికి ఎక్కువ పరిమితి ఉంటుంది. ముందుగా తీసుకున్న కార్డ్ కు తక్కువ పరిమితి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని తక్కువ ఉన్నదాన్ని క్లోజ్ చేస్తే మేలనుకుంటారు. మీరు ఇలాగే అనుకున్నారా. ఇలా చేస్తే ఏళ్లతరబడి సాధించుకున్న మీ క్రెడిట్ హిస్టరీని పోగొట్టుకున్నట్టే.

- Advertisement -

అవును మీరు జీవితంలో మొదట తీసుకున్న క్రెడిట్ కార్డు లోన్స్ ఆధారంగానే మీ క్రెడిట్ హిస్టరీ డెవలప్ అవుతుంది. తక్కువ లిమిట్ కారణంగా దాన్ని క్లోజ్ చేయాలనుకోవడం మంచి నిర్ణయమైతే కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే మీరు ఐదేళ్లక్రితం ఓ క్రెడిట్ కార్డు తీసుకొని ఉంటారు. దాన్ని వినియేగించుకోవడం మొదలు పెట్టాక మీ క్రెడిట్ హిస్టరీ వయసు మొదలవుతుంది. ఇలా చూస్తే దాని ఏజ్ ఇప్పటికి ఐదేళ్లు. కొత్తగా ఏడాది క్రితం కార్డ్ తీసుకుని ఉంటే.. మొదట తీసుకున్నదాన్ని క్లోజ్ చేయడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ కేవలం ఏడాదికి పడిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి.

- Advertisement -

ప్రభావాలు.. ప్రత్యామ్నాయాలు

మొదటి క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం వల్ల కేవలం వయసు మాత్రమే కాదు. సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. ఒకవేళ హోమ్ లోను తీసుకొని ఉంటే క్రెడిట్ స్కోరు కాస్త హెల్దీగానే ఉండే అవకాశం ఉంటుంది. దీని తర్వాత,హోమ్ లోను, కార్ లోన్, పర్సనల్ లోన్, వంటివి తీసుకుంటే క్రెడిట్ స్కోర్  తక్కువ ఉంటుంది కాబట్టి లోన్ కు సంబంధించి వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించుకోవాలి.

Also Read: దేశంలో సూపర్ బైక్స్ క్రేజ్.. తగ్గిందా? పెరిగిందా? 

మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచిస్తున్నారా? సింపుల్.. ఇప్పుడున్న పరిమితిలో ఎంతమొత్తం అదనంగా కావాలనుకుంటున్నారో మొదట తీసుకున్న క్రెడిట్ కార్డు బ్యాంక్ తో చర్చించండి. ప్రతి నెలా బిల్ సరిగ్గా కడుతూ క్రెడిట్ స్కోరు హెల్దీగా ఉంటే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు లిమిట్ తో క్రెడిట్ కార్డు అప్ గ్రేడ్ చేస్తారు. అంతే కాకుండా అదనపు బెనిఫిట్స్ తో వచ్చే క్రెడిట్ కార్ఢులు సూచిస్తారు. వీటిని సక్రమంగా వినియోగించి క్యాష్ బ్యాక్, మూవీ టికెట్స్, ఇతరత్రా లాభాలను పొందవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News