Big Stories

KTR Says Hyd is UT: బాంబ్ పేల్చిన కేటీఆర్.. యూటీగా హైదరాబాద్, గతంలో కూడా..!

KTR Sensational Comments on Hyderabad: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా ఎలాగైనా కొన్నిసీట్లు గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది విపక్ష గులాబీ పార్టీ. ఈ క్రమంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. రాజకీయ వ్యూహాలను అమలు చేసుకుంటూపోతోంది. ప్రజల్లో ఒకవిధమైన ఆసక్తిని రేపుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కేటీఆర్ కొత్త బాంబ్ పేల్చారు.

- Advertisement -

జూన్ రెండు తర్వాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సిద్ధంగా ఉందన్నారు కేటీఆర్. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా చిన్నపాటి చర్చ మొదలైంది. ఏపీ-తెలంగాణ ఏర్పడి జూన్ రెండు నాటికి పదేళ్లు పూర్తికానుంది. పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్విభజన చట్టంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. జూన్ రెండు తర్వాత హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని, దీనికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందన్నారు కేటీఆర్.

- Advertisement -

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ బూత్ కమిటీ స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తమ పార్టీకి ఓటు వేస్తే హైదరాబాద్ యూటీ చేయడాన్ని అడ్డుకుంటామన్నది ఆయన మాట. లోక్‌సభలో అడ్డుకోవడానికి బీఆర్ఎస్‌ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది కేటీఆర్ మాట.

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. నాలుగేళ్ల కిందట ఈ తరహా వార్తలు వచ్చాయి. గతంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారనే వార్తలు లేకపోలేదు. నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ సమావేశం జరిగింది. దానికి కొంతమంది సివిల్స్ అధికారులు హాజరయ్యారు. అప్పట్లో హైదరాబాద్ యూటీ విషయాన్ని ప్రస్తావించినట్లు వార్తలు లేకపోలేదు. ప్రస్తుతం ఢిల్లీలో రద్దీ పెరగడం ఒకటైతే.. శీతాకాలంలో పొగమంచు కారణంగా అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలను లేవనెత్తారు.  ఈ క్రమంలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ యూటీ అయితే అన్నివిధాలుగా బాగుంటుందని, శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఇక్కడ జరగుతాయని అనుకున్నారు.

Also Read: ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్.. కేసీఆర్ ఇంకా..

ఒకవేళ హైదరాబాద్ యూటీగా చేసే ఆలోచన కేంద్రానికి ఉంటే ఆ నిర్ణయం రాజకీయ పార్టీలకు తెలీకుండా ఉంటుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాలు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోరని, ఈ లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే యూటీపై నిర్ణయం తీసుకున్నారేమోనని అంటున్నారు. అందుకే కేటీఆర్ అంత గట్టిగా చెబుతున్నారని కాంగ్రెస్ నేతల నుంచి బలంగా వినిపిస్తున్నమాట. మరోవైపు దేశానికి రెండో రాజధానిగా చేస్తే తాము సిద్ధమేనని తమిళనాడు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పలుపార్టీలు తెలిపాయి. క్రమంలో బెంగుళూరు అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం అక్కడ వాటర్ సమస్య వెంటాడుతోంది. ఇక మిగిలింది ఒక్క హైదరాబాద్ మాత్రమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News