Big Stories

Infinix Note 40 Pro Mobile: 108 MP కెమెరా, 256GB స్టోరేజ్.. 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్

Offers on Infinix Note 40 Pro Mobile: ప్రముఖ టెక్ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌కు దేశ వ్యాప్తంగా విపరీతమై క్రేజ్ ఉంది. కంపెనీ ఈ నెల ప్రారంభంలో Infinix నోట్ 40 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నోట్ 40 ప్రో మొబైల్‌ను 5000 mAh బ్యాటరీ, 256GB స్టోరేజ్ వంటి ఫీచర్లతో లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు.  ఫ్లిప్‌కార్ట్‌లో అనేక బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌ను సేల్‌కు తీసుకొచ్చారు. దీన్ని కొనుగోలు చేసేటప్పుడు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పుడు ఫోన్‌ను కొనడం ద్వారా చాలా వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌పై ఉన్న పూర్తి వివరాలు తెలుసుకోండి.

- Advertisement -

Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఈ నెల ప్రారంభంలో మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.ఇప్పుడు ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌లతో కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశం లభించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. CICI, HDFC, PNB క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లపై రూ.1000 ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో నో కాస్ట్ EMI సౌకర్యం కూడా అందించారు.

- Advertisement -

Also Read: స్టైలిష్ డిజైన్‌తో ఇన్‌ఫినిక్స్ నుంచి గేమింగ్ ఫోన్ లాంచ్!

దీనిపై రూ.19,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. అయితే ఇందులో మీరు ఫ్లిప్‌కార్ట్ టర్మ్ అండ్ కండిషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం చూస్తే అతి తక్కువ ధరకే ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 21,999కి అమ్మకానికి ఉంచారు. ఇది వింటేజ్ గ్రీన్, టైటాన్ గోల్డ్ కలర్స్‌లో వస్తుంది.

Infinix Note 40 Pro 5G స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే  స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల డిస్‌ప్లే 120 Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89.8 శాతం, రిజల్యూషన్ 1080 x 2436 పిక్సెల్స్. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్‌తో  లభిస్తుంది. ఫోన్‌లో ఆక్టా-కోర్ Mediatek డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది . ఇది IMG BXM-8-256 GPU లైనప్‌లో పని చేస్తుంది. ఇది 8 GB+256 GB స్టోరేజ్‌తో వస్తుంది.

Also Read: 50MP ఫ్రంట్ కెమెరాతో హానర్ న్యూ స్మార్ట్‌ఫోన్.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

ఇక ఫోన్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , f/2.4 2 MP, 2 MP మూడవ సెన్సార్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ 45 W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000 mAh బ్యాటరీ నుండి పవర్ పొందుతుంది. కంపెనీ ప్రకారం ఇది కేవలం 26 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. దీనికి 20 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News