BigTV English

Arvind Kejriwal Petition : అరెస్ట్ పై అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్.. నేడు సుప్రీంలో విచారణ

Arvind Kejriwal Petition : అరెస్ట్ పై అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్.. నేడు సుప్రీంలో విచారణ

Arvind Kejriwal Petition updates(Telugu flash news): ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేయనుంది. కాగా.. అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఫైల్ చేసింది.


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. అరవింద్ కేజ్రీవాల్ కు 9 సార్లు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నట్లు ఈడీ అఫిడవిట్ లో పేర్కొంది. ఈ కేసులో కేజ్రీవాల్ హస్తం ఉందనేందుకు దర్యాప్తు చేసిన అధికారుల వద్ద ఆధారాలున్నాయని, ఆయనను చట్టబద్ధంగానే అరెస్ట్ చేశామని పేర్కొంది. దీనిపై కేజ్రీవాల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

Also Read : కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉంది.. ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!


లోక్ సభ ఎన్నికల ముందు తనను అరెస్ట్ చేసి.. ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ ను ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. ఆప్ కు సౌత్ గ్రూప్ నుంచి నిధులు అందాయని, వాటిని గోవా ఎన్నికలకకు ఉపయోగించారన్న ఆరోపణల్లో నిజంలేదని తెలిపారు. ఈ కుంభకోణంలో కవిత, కేజ్రీవాల్ ల అరెస్టులు సంచలనం రేపాయి. మార్చి 21న ఈడీ అధికారులు రెండున్నర గంటల సమయంపాటు తనిఖీలు చేసిన తర్వాత.. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు.

Related News

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Big Stories

×