E-Paper
Advertisement

Migraine: మైగ్రేన్ నొప్పి తట్టుకోలేకపోతున్నారా? ఈ ఆకులను వాడారంటే వెంటనే తగ్గుతుంది

Migraine: మైగ్రేన్ నొప్పి తట్టుకోలేకపోతున్నారా? ఈ ఆకులను వాడారంటే వెంటనే తగ్గుతుంది
Advertisement

మైగ్రేన్ తలనొప్పి ఒకసారి మొదలైతే చాలా తీవ్రంగా ఉంటుంది. తల పగిలేలా నొప్పి, కాంతి చూసినా ఇబ్బంది, చిన్న శబ్దం కూడా బాధ కలిగిస్తుంది. చాలా మంది వెంటనే మందులు తీసుకుంటారు. కానీ తరచుగా మందులు తీసుకోవడం కూడా మంచిది కాదు. అలాంటి సమయంలో ఇంట్లోనే లభించే కొన్ని సహజ మార్గాలు ఉపశమనం ఇవ్వగలవు. అందులో నిమ్మ ఆకులు మంచి ఎంపికగా చెబుతున్నారు. నిమ్మ ఆకుల్లో సహజంగా ఉండే సుగంధ తైలాలు శరీరాన్ని కూల్‌గా ఉంచడంలో సహాయం చేస్తాయి. ఇవి మనసును ప్రశాంతంగా మార్చే గుణం కలిగి ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే తలనొప్పిని తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. నిమ్మ ఆకుల వాసన కూడా మెదడును రిలాక్స్ చేస్తుంది. దీంతో నొప్పి తీవ్రత కొంత తగ్గుతుంది. అందుకే ఈ ఆకులను పాత కాలం నుంచి సహజ చికిత్సగా ఉపయోగిస్తున్నారు.

Also read: Dates with Milk: పాలు ఖర్జూరం కలిపి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే ఇప్పుడే తినడం ప్రారంభిస్తారు

Advertisement

నిమ్మ ఆకులు ఎలా వాడాలి?
ఈ నిమ్మ ఆకులను ఉపయోగించడం చాలా సులభం. కొద్దిగా తాజా ఆకులు తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని కొద్దిగా చల్లారిన తర్వాత టీలా తాగవచ్చు. ఇలా తాగితే శరీరానికి చల్లదనం లభిస్తుంది. మరో విధానం, ఆకులను నలిపి పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న చోట రాసుకోవచ్చు. తలపై ఇలా పెట్టుకుంటే కూలింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇంకో మార్గం, ఈ ఆకులతో ఆవిరి తీసుకోవడం. ఇది తలనొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అయితే ఇది పూర్తిగా మైగ్రేన్‌కు పరిష్కారం కాదు. తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. మైగ్రేన్‌కు ప్రధాన కారణాలు స్ట్రెస్, నిద్రలేమి, అసమయ ఆహారం. ఇవి నియంత్రించకపోతే నొప్పి మళ్లీ మళ్లీ వస్తుంది. కాబట్టి రోజూ సరైన నిద్ర తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం.

Also read: Nails Health: గోళ్లపై గీతలు కనిపిస్తున్నాయా? అయితే మీ ఆరోగ్యం జాగ్రత్త

Advertisement

నిమ్మ ఆకుల చిట్కాను పాటించేందుకు చాలా సులభ మార్గం. మైగ్రేన్ నొప్పి సమయంలో కొంత ఉపశమనం ఇస్తాయి. కానీ దీన్ని మాత్రమే నమ్మకుండా, జీవనశైలిని సరిచేసుకోవడం ముఖ్యం. నొప్పి ఎక్కువగా ఉంటే లేదా తరచుగా వస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఆరోగ్యం కోసం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, పెద్ద సమస్యలు దూరంగా ఉంటాయి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×