E-Paper
Advertisement

ఓరేయ్ పాపిష్టోడా.. ఇదేం పనిరా.. పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు!

ఓరేయ్ పాపిష్టోడా.. ఇదేం పనిరా.. పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు!
Advertisement

Kanpur Shocker: సాధారణంగా అత్తను తల్లిలా భావించడం మన సమాజంలో ఒక సాంప్రదాయం. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఒక విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. వరుసలకు అతీతంగా ఒక అల్లుడు తన అత్తనే వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

కోర్టులోనే పెళ్లి వేడుక!

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడు తన అత్తను చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వారు స్థానిక కోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్రాంగణంలోనే నలుగురి సమక్షంలో ఒకరికొకరు పూలదండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి ముగిసిన తర్వాత వారి బంధానికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ ను చూపించారు.

Advertisement

అసలేం జరిగిందంటే?

కాన్పూర్ లోని దేహాత్ అక్బర్ పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తోందని తెలుస్తోంది. కూతురితో పెళ్లి తర్వాత అత్తగారింటికి అల్లుడు రాకపోకలు సాగించాడు. ఈ క్రమంలో అత్తతో ప్రేమలో పడ్డాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం.

గొడవలు జరిగినా తగ్గలేదు..!

Advertisement

తమ బంధం గురించి కుటుంబ సభ్యులకు తెలయడంతో ఇంట్లో పెద్ద ఎత్తున పంచాయితీలు, గొడవలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ వారిద్దరు వెనక్కి తగ్గలేదని స్థానికులు చెబుతున్నారు. చివరకు సమాజం ఏమనుకున్నా సరే కలిసి జీవించాలనే గట్టి నిర్ణయంతో కోర్టు వేదికగా ఒకటయ్యారు. తమ పెళ్లిని చట్టబద్ధం చేసుకునేందుకే వారు కోర్టులో ఈ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: BRS: గులాబీ బాస్‌కు సొంత లీడర్ల సెగ.. పార్టీని ముంచుతున్న ఒంటెద్దు పోకడలు!

నెటిజన్ల రియాక్షన్ ఇదే

అత్తా అల్లుడి వివాహ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘కలియుగం అంటే ఇదేనేమో.. వరుసలు, బంధాలు అన్నీ మారిపోతున్నాయి’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఇలాంటి వింత పెళ్లిళ్లు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోతున్నాయి’ అని ఇంకొకరు రాశారు. మరికొందరైతే ‘వారి వ్యక్తిగత జీవితం వారిష్టం’ అని పోస్టులు పెడుతుండటం గమనార్హం. మెుత్తంగా చూస్తే సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలకు, సామాజిక విలువలకు ఈ తరహా ఘటనలు గొడ్డలిపెట్టు లాంటివని చెప్పవచ్చు.

Also Read: హిట్ల‌ర్ పాల‌న .. అహంకార ప్ర‌ద‌ర్శ‌న‌!? ఎవ‌రిది..!? నియంతృత్వ పోక‌డ‌ల చ‌రిత్ర ఎట్టిద‌నిన‌..!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×