E-Paper
Advertisement

ఇలాంటి ఇల్లు ఉంటే.. లైఫ్‌లో ఏసీ, కూలర్ అక్కర్లేదు.. 40 ఏళ్లుగా 10°C ఉష్ణోగ్రత!

ఇలాంటి ఇల్లు ఉంటే.. లైఫ్‌లో ఏసీ, కూలర్ అక్కర్లేదు.. 40 ఏళ్లుగా 10°C ఉష్ణోగ్రత!
Advertisement

Cool Home: వేసవి కాలం వస్తే చాలు ఏసీలు, కూలర్లు లేనిదే క్షణం గడవని పరిస్థితి. జూన్ నెల ఎంటర్ అయినప్పటికీ దేశంలో భానుడి భగ భగలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో ఎండలు మరింత ఉక్కపోతను కలిగిస్తున్నాయి. అయితే అంతటి వేడిలోనూ అక్కడి ఓ ఇల్లు.. ఎలాంటి ఏసీలు, కూలర్లు లేకుండానే చల్లగా దర్శనమిస్తోంది. 40 ఏళ్లుగా ఏసీ, కూలర్ తో పనిలేకుండా అనిత, విజయ్ దంపతులు.. హాయిగా జీవిస్తున్నారు. ఇంతకీ వారి ఇంటి ప్రత్యేకత, స్మార్ట్ డిజైన్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత

ఇంటిని సంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించుకోవడమే.. ఈ చల్లదనానికి కారణమని దిల్లీకి చెందిన అనిత, విజయ్ దంపతులు స్పష్టం చేస్తున్నారు. 4 దశాబ్దాలుగా బయటి కంటే 10 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత ఇంట్లో నమోదవుతోందని వారు పేర్కొన్నారు. చలి, ఎండ, వర్షం అన్ని వేళలా ఒకటే టెంపరేచర్ ఇంట్లో మెయిన్ టెన్ అవుతోందని తెలియజేస్తున్నారు. ప్రకృతిలో మమేకమవుతూ వారు నిర్మించుకున్న ఈ ఇంటి డిజైన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇంటి చుట్టూ మెుక్కలు

Advertisement

ఇక ఇంటి నిర్మాణం విషయానికి వస్తే.. పాతకాలపు ఇళ్ల తరహాలో ఇంటి పరిసరాల్లో ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. దాని గుండా గాలి వెలుతురు లోపలికి వస్తూ.. వేడి గాలి ఆటోమేటిగ్గా బయటకు వెళ్లిపోతుంది. ఇంటి ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో మెుక్కలు, చెట్లు పెంచడం వల్ల కిటికీలు, తలుపుల గుండా నిత్యం చల్లటి గాలి వీస్తున్నట్లు దంపతులు తెలిపారు. పైకప్పు నుండి వేడి లోపలికి రాకుండా ప్రత్యేక ఇన్సులేషన్ పద్ధతులను ఉపయోగించినట్లు పేర్కొన్నారు.

సౌరశక్తితో విద్యుత్ బిల్లు ఆదా

తమ ఇల్లు చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుందని దంపతులు తెలియజేస్తున్నారు. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన ఎన్నో అద్భుతాలు ఇక్కడ ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఇంటి మేడపై కూడా చెట్లను పెంచడం వల్ల అదనపు కూలింగ్ వస్తోందని వారు తెలిపారు. విద్యుత్ అవసరాల కోసం పూర్తిగా సౌరశక్తిపై ఆధారపడటం వల్ల కరెంట్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా కంట్రోల్ అవుతోందని అన్నారు.

Advertisement

Also Read: లోకల్ బస్సు ఎక్కితే.. దుబాయికి టికెట్ కొట్టాడు.. బిత్తరపోయిన ప్యాసింజర్!

వర్షపు నీరు నిల్వ

మరోవైపు వర్షపు నీటిని నిల్వ చేసే వ్యవస్థను సైతం ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లు అనిత, విజయ్ దంపతులు తెలిపారు. ఆకాశం నుండి పడే ప్రతి వాన చుక్కను వృథా చేయకుండా భూగర్భంలోకి పంపేలా ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇంట్లో వచ్చే తడి చెత్తను పారేయకుండా మొక్కలకు మేలైన సేంద్రియ ఎరువుగా మారుస్తున్నట్లు చెప్పారు. మెుత్తంగా పర్యావరణానికి హాని చేస్తూ బతకడం కంటే.. ప్రకృతితో కలిసి జీవించడం ఎంత సుఖవంతమో ఈ ఇల్లు నిరూపిస్తోంది. సాంకేతికతపై మాత్రమే ఆధారపడకుండా సరైన నిర్మాణ పద్ధతులను పాటిస్తే వేసవి తాపాన్ని సులువుగా జయించవచ్చని అనిత, విజయ్ దంపతుల ఇల్లు అందరికీ నేర్పుతోంగని నిపుణులు అంటున్నారు.

Also Read: BSNLకు హైకోర్టు బిగ్ షాక్.. ఏకంగా రూ.55 లక్షల జరిమానా.. అసలేం జరిగిందంటే?

Related News

బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!

వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

Big Stories

Advertisement
×