E-Paper
Advertisement

Actress Laya: కెరీర్ వదిలేసి, 24 ఏళ్లకే పెళ్లి చేసుకోవడానికి కారణం అదే!

Actress Laya: కెరీర్ వదిలేసి, 24 ఏళ్లకే పెళ్లి చేసుకోవడానికి కారణం అదే!
Advertisement

Actress Laya: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన లయ (Actress Laya).. తన ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా చెప్పారు. తాజాగా ఆమె ‘కిస్సిక్ టాక్స్’ (Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్ని అనేక విషయాలపై మాట్లాడారు. ఈ క్రమంలో తన ఫ్యామిలీ తనకు ఎంత సపోర్ట్ ఇచ్చానే విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

రెస్పాన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ ఒక లెవల్‌లో..

‘‘నా వరకు అయితే మాత్రం.. నాకు నా పిల్లలు, భర్తే ముఖ్యం. వాళ్లే ఫస్ట్. వాళ్లు ఈ ఫీల్డ్ వద్దంటే ఆగిపోతాను. నా పిల్లలు కూడా వాళ్లంతట వాళ్లే చెప్పారు.. ‘అమ్మా నువ్వు వెళ్లి వర్క్ చెయ్. నువ్వు బాగా చేస్తావు. మా కోసం ఆగిపోవద్దు. మమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, బాగా చదువుకుంటాం. నువ్వు వెళ్లి చెయ్’.. అని అన్ని చెప్పారు కాబట్టే.. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉండగలుగుతున్నాను. పెళ్లి తర్వాత మాత్రం ఇక యాక్టింగ్ వద్దని నేనే నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే, నేను అమెరికాలో ఉంటాను. సినిమా చేయాలంటే ఇక్కడకు రావాలి. అప్ అండ్ డౌన్ చేయాలి. ఇప్పుడు పెళ్లై 20 సంవత్సరాలు అయ్యింది. మా ఇద్దరికి ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. ఇన్ సెక్యూరిటీ లేదు. నా రెస్పాన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ ఒక లెవల్‌లో ఉన్నాయని చూసుకుని, అన్ని ప్లాన్ చేసుకుని, ఓకే అనుకున్నాకే.. వచ్చి చేయగలం. (Laya Family)

Advertisement

Also Read- Kissik Talks: ‘అమ్మోరు’లో మొదట నాకే అవకాశం వచ్చింది.. ఎందుకు చేయలేదంటే? – లయ

24 ఇయర్స్‌కే పెళ్లి అందుకే..

ఇది మా లైఫ్.. మేము డిజైన్ చేసుకున్నాం. ఇది అందరికీ వర్కవుతుందని నేను అనడం లేదు. కొంతమంది భర్తలు చేయలేరు. నా భర్త చేయగలడు. అది నా లక్. అలా అని నేను గ్రాంటెడ్‌గా తీసుకోలేను.. వందసార్లు అడుగుతాను. ఇది ఓకేనా అని. నేను సినిమా చేస్తున్నాను… ఈజ్ ఇట్ ఓకేనా? ఉండనా? అని రెగ్యులర్‌గా మాట్లాడుతుంటాను. ఆయన ఓకే అంటేనే చేయగలను.. లేదంటే ఒక్క నిమిషం కూడా చేయలేను. అందుకే అంత తొందరగా పెళ్లి చేసుకున్నాను. కెరీర్ వదిలేసి మరీ వెళ్లాను అంటే.. అలాంటి పర్సన్ నాకు దొరకరనే. ఆయన అంత మంచి వారు కాబట్టే.. 24 ఇయర్స్‌కే పెళ్లి చేసేసుకున్నాను. సినిమాలు ఇంపార్టెంట్ అని నేను ఆగిపోయి ఉంటే, నాకు ఎలాంటి వాళ్లు వచ్చేవారో. ఇది జీవితం.. ఇక మొత్తం సాగాల్సింది అతనితోనే. అది నేను ఆలోచించాను.

Advertisement

Also Read- Actress Laya: ఓన్లీ వెజిటేరియన్.. నటి లయ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా!

ఫ్రీడమే కారణం

నేను ఏం చేసినా నా భర్త, నా పిల్లల సపోర్ట్ ఉండబట్టే. ఆయన మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి అర్థం చేసుకున్నారని అనుకోవచ్చు.. కానీ, నా పిల్లలు కూడా నాకు అంతే సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎనీ రిలేషన్‌షిప్.. అసలు బేసిగ్గా ఉండాల్సిన రెస్పెక్ట్, బౌండరీ, ఒక లైన్.. చాలా మంది ఫాలో అవడం లేదు. ఇక్కడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకునే చోట ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇలా జరగడానికి కారణం ఫ్రీడమ్ అని నేను అనుకుంటున్నాను. ఫ్రీడమ్ అని చెప్పి ఎదుటివారు సఫర్ అయ్యేలా చేస్తున్నారు’’ అని అన్నారు.

Also Read- Big TV Kissik Talks: నువ్వేంటి నాకు చెప్పేది? అనే వారే కానీ.. శివాజీ కాంట్రవర్సీపై లయ!

Related News

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Podarillu Today Episode : జయంతి తమ్ముడు అవమానం.. చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. జయంతి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×