E-Paper
Advertisement

Weekly Horoscope: ఈ వారం ఆ రాశి వ్యాపారస్తులకు లాభాలు

Weekly Horoscope: ఈ వారం ఆ రాశి వ్యాపారస్తులకు లాభాలు
Advertisement

Weekly Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (మార్చి 15 – మార్చి 21) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:

ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. అన్నిరంగాల వారికి అనుకూల సమయం.

వృషభ రాశి: 

Advertisement

ఈ వారం మీకు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరతాయి. బంధువర్గంతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలలో అవాంతరాలు తొలగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయి అవుతుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషానిస్తుంది. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

 మిథున రాశి: 

ఈ వారం మీకు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి.

కర్కాటక రాశి:

Advertisement

ఈ వారం మీకు ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటాబయటా సమస్యలు అధిగమవుతాయి. సోదరులను కలుసుకుని వివాహ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ధనాప్రాప్తి.

సింహారాశి:

ఈ వారం మీకు అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలుంటాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారులతో ఉన్న సమస్యలు ఆదిగమిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం.

 కన్యా రాశి: 

ఈ వారం మీకు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. విలువైన వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఈ వారం మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాలలో మరింత నిదానంగా వ్యవహారించాలి. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది.

వృశ్చిక రాశి: 

ఈ వారం మీకు రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూల మవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి.

ధనస్సు రాశి:

ఈ వారం మీకు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

మకర రాశి:

ఈ వారం మీకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగమున్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని నూతన గృహ వాహన యోగం ఉన్నది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున జీత భత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి.

కుంభ రాశి: 

ఈ వారం మీకు కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. వారం చివరిలో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. 

మీన రాశి:

ఈ వారం మీకు ఏ పని చేపట్టినా నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో ఆకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విఫలమవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో వివాదాలు తప్పవు. వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×