E-Paper
Advertisement

Iran Kharg Isand: ఇరాన్ కు ‘ఖార్గ్ ద్వీపం’ ఎందుకంత కీలకం?

Iran Kharg Isand: ఇరాన్ కు ‘ఖార్గ్ ద్వీపం’ ఎందుకంత కీలకం?
Advertisement

Iran Kharg Isand: ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతానికి పైగా ప్రాసెస్ చేసేది.. 20 చదరపు కి.మీ విస్తీర్ణంలోని ‘ఖార్గ్ ద్వీపం’ లోనే. శుక్రవారం ఈ ద్వీపం లక్ష్యంగా అమెరికా దాడులు ప్రారంభించింది. అయితే ఈ ద్వీపం ఇరాన్ కు ఎందుకంత కీలకం అనేది తెలుసుకుందాం.

చిన్న ద్వీపం పెద్ద పాత్ర

బుషెహర్ ప్రావిన్స్ ప్రధాన భూభాగానికి 28 కిలోమీటర్ల దూరంలో.. పెర్షియన్ గల్ఫ్ ఉత్తర భాగంలో ఉన్న ఈ ద్వీపం ఖార్గ్. ఇది ఎనిమిది కిలోమీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఖార్గ్ ద్వీపాన్ని ఇరాన్ “కిరీట రత్నం” అని పిలిచినప్పటికీ, కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ ఇరానియన్ రచయిత జలాల్ అల్-ఎ-అహ్మద్ ఈ ద్వీపాన్ని “పర్షియన్ గల్ఫ్ అనాథ ముత్యం” అని పిలిచారు.

Advertisement

ఖార్గ్ ద్వీపంలోని మౌలిక సదుపాయాలు, చమురు నిల్వ ట్యాంకులు, లోడింగ్ టెర్మినల్స్, పైప్‌లైన్‌లు ముడి చమురు రంగానికి కీలకంగా పనిచేస్తాయి. ఈ టెర్మినల్ మూడు ప్రధాన ఆఫ్‌షోర్ స్టేషన్స్ అబూజర్, ఫోరౌజాన్, డోరూడ్ నుంచి ముడి చమురును సేకరించి, దానిని పైపులైన్ల నెట్‌వర్క్ ద్వారా సముద్రతీరంలోని ప్రాసెసింగ్ యూనిట్లకు రవాణా చేసి, నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ప్రపంచ మార్కెట్లకు రవాణా చేస్తారు.

95 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా

ఇరాన్‌లోని అతిపెద్ద చమురు క్షేత్రాలైన అహ్వాజ్, మారున్, గచ్సరన్ నుంచి పైప్‌లైన్‌లు నేరుగా ఖార్గ్ స్టోరేజ్ ట్యాంకుల్లోకి వెళ్తాయి. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 95 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేస్తారు. ఇరాన్ ప్రభుత్వానికి, సైన్యానికి నిధులు సమకూర్చడంలో ఖార్గ్ ద్వీపం కీలకం. ఇరాన్ ఖార్గ్‌పై నియంత్రణ కోల్పోతే, ఆ దేశం పనిచేయడం కష్టమవుతుంది.

Advertisement

1960, 1970లలో ఇరాన్ చమురు విస్తరణలో భాగంగా ఖార్గ్ ద్వీపం కీలకంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఖార్గ్ ద్వీపంపై దాడిలో జాగ్రత్తగా వ్యవహరించాయి. అయితే తాజాగా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి యూఎస్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. శుక్రవారం జపాన్‌ నౌక USS ట్రిపోలి దాని 2,500 మంది మెరైన్‌లతో పాటు ఈ ద్వీపానికి పంపింది.

ఖార్గ్ ద్వీపంపై దాడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా సైన్యం ఖార్గ్ ద్వీపంలోని లక్ష్యాలపై భారీగా బాంబు దాడులు చేశారన్నారు. ద్వీపంలోని చమురు కేంద్రాలను ధ్వంసం చేశామన్నారు. “ఖార్గ్ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నాం. ఇరాన్ లేదా మరెవరైనా హార్ముజ్ జలసంధి మార్గంలో నౌకలను రాకుండా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే..దాడి మరింత తీవ్రంగా ఉంటుంది”  అని ట్రంప్ హెచ్చరించారు.

ప్రపంచంలోని మొత్తం చమురులో 20 శాతం రవాణా అయ్యే కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్భంచింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పెరిగాయి. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (OPEC)లో నాల్గో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుగా ఉన్న ఇరాన్..  యుద్ధం కొనసాగినంత కాలం గల్ఫ్ దేశాల నుంచి ఒక్క లీటరు చమురు కూడా ఎగుమతి చేయనివ్వమని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.

Also Read: US–Iran War: ఇరాన్ ముందు ట్రంప్ ప్లాన్ ఫెయిల్.. యుద్ధం ఇప్పట్లో ఆగే ఛాన్స్ ఉందా లేదా!

Related News

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ, భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..

Big Stories

Advertisement
×