E-Paper
Advertisement

Laya Kissik Talks: బ్లైండ్ పాత్ర చేస్తే.. ఫస్ట్ వీక్ కోటి లాస్ అన్నారు.. థర్డ్ వీక్ కోటి లాభం అన్నారు

Laya Kissik Talks: బ్లైండ్ పాత్ర చేస్తే.. ఫస్ట్ వీక్ కోటి లాస్ అన్నారు.. థర్డ్ వీక్ కోటి లాభం అన్నారు
Advertisement

Laya Kissik Talks: సీనియర్ హీరోయిన్ లయ (Senior Heroine Laya) తన సినీ కెరీర్‌లో చేసిన బ్లైండ్ పాత్ర గురించి, ఆ పాత్ర చేసినప్పుడు వచ్చిన విమర్శల గురించి తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్‌ (Big TV Kissik Talks)లో వివరంగా చెప్పారు. ప్రస్తుతం రీ ఎంట్రీలో ఆమె వరస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. శివాజీ (Sivaji) నిర్మించి, నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే కెరీర్‌లో తను చేసిన ఓ పాత్ర విషయంలో మాత్రం బాగా భయపడిపోయానని చెప్పుకొచ్చారు. ఆ పాత్ర ఏదో కాదు.. ‘ప్రేమించు’ (Preminchu) మూవీలోని బ్లైండ్ పాత్ర చేసినప్పుడు కొందరు చేసిన విమర్శలు తనను భయపెట్టాయని లయ చెప్పారు. దీని వెనుక ఉన్న అసలు విషయం ఆమె మాటల్లోనే..

Also Read- Actress Laya: ఓన్లీ వెజిటేరియన్.. నటి లయ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా!

ధైర్యం చేశా కానీ, భయంగానే ఉండేది

Advertisement

‘‘నాకు ఆ సమయంలో ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. ఎవరూ అడ్వైజ్ చేసే వాళ్లు కూడా లేరు. అలాంటి టైమ్‌లో మనమే నిర్ణయం తీసుకోవాలి.. ధైర్యంగా ఆ బ్లైండ్ పాత్ర చేయాలని అనిపించింది. హిట్టయినా, ఫ్లాప్ అయినా నేను చేస్తే బాగుంటుందని అనిపించింది. నిజంగా హిట్టు అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు నేను కావాలని అనుకున్నా కూడా అలాంటి రోల్ నాకు రాదు. ఏదయితే అది అవుతుందని, ధైర్యంగా చేయాలని ఒప్పేసుకున్నా. తర్వాత అందరూ చెప్పారు. ఇది డీ గ్లామర్, ఒక కమర్షియల్ హీరోయిన్‌గా వెళ్లాలనుకుంటే.. మీరు ఆర్ట్ ఫిల్మ్‌లన్నీ చేస్తారేంటి? అని ఒకరిద్దరు నేను ఒప్పేసుకున్నాక నాతో అన్నారు. అయినా వెనక్కి తగ్గాలని అనుకోలేదు. మనం ఒప్పుకున్నాం.. ఏదైతే అది అయింది చేసేద్దామనే అనుకున్నా.. ఎక్కడో కాస్త భయం ఉండేది. ఏంటి అందరూ ఇలా అంటున్నారు. దీని వల్ల నెక్ట్స్ ఫిల్మ్స్‌కు ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందా? నాకేమీ అర్థం కాలేదు. నాకు అసలు ఏం నాలెడ్జ్ లేదు. అప్పుడు నాకు 18 లేదంటే 19 సంవత్సరాలు ఉంటాయి. ఆ సినిమా 2000లో విడుదలైంది.

Also Read- Kissik Talks: ‘అమ్మోరు’లో మొదట నాకే అవకాశం వచ్చింది.. ఎందుకు చేయలేదంటే? – లయ

లాస్ అన్నప్పుడు బాధేసింది

Advertisement

సినిమా రిలీజైన వారం తర్వాత డి రామానాయుడుగారు.. మనకు వన్ క్రోర్ పోయిందమ్మా అని అన్నారు. రిజల్ట్ బాలేదని అప్పుడు నాకు అర్థమైంది. ఏదో కొంచెం పబ్లిసిటీ అది చేస్తున్నారు. తర్వాత సడెన్‌గా సాంగ్ పికప్ అయింది. సెకండ్ వీక్‌కు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత వన్ వీక్‌కు అనుకుంటా.. రామానాయుడుగారు మనకి వన్ క్రోర్ లాభం వచ్చిందమ్మా అన్నారు. రికవరీ అవడంతో పాటు లాభాలు కూడా వచ్చాయి. మంచి ప్రశంసలు వచ్చాయి. తర్వాత టీవీలలో వేసి వేసి.. ఆల్మోస్ట్ వారానికి ఒకసారి వస్తూనే ఉండేది. ఆయన లాస్ అన్నప్పుడు చాలా బాధేసింది. కానీ, ఏం చేయలేం కదా. కాకపోతే, ఆ సినిమా కోసం దాదాపు వన్ ఇయర్ పని చేశాం.. కానీ ఒక్క రోజులోనే బాలేదు అంటే బాధేయకుండా ఎలా ఉంటుంది. నాకే కాదు, ఇండస్ట్రీలోని అందరికీ ఈ విషయంలో బాధగానే ఉంటుంది. కొందరైతే అసలు తీసుకోలేరు కూడా. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. లైఫ్‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌ సేమ్ బోట్‌లో వెళుతుంటాయి. ఇవాళ సక్సెస్ వచ్చింది కాబట్టి.. రేపు కూడా సక్సెస్ వస్తుందనేం లేదు. ఇవాళ ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి.. రేపు కూడా ఫెయిల్యూర్ వస్తుందనేం లేదు. దిస్ ఈజ్ నాట్ ఎండ్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇంకాస్త గట్టిగా కృషి చేసి సక్సెస్ అవ్వాలి’’ అని లయ అసలు విషయం చెప్పారు.

Also Read- Big TV Kissik Talks: నువ్వేంటి నాకు చెప్పేది? అనే వారే కానీ.. శివాజీ కాంట్రవర్సీపై లయ!

Related News

నాకు కన్నీళ్లు ఆగలేదు.. ఆ ఒక్కటి చూసి షాక్ అయ్యాను..

13 ఏళ్లుగా యాంకర్ ప్రదీప్ పై ప్రేమ.. ఎట్టకేలకు ఓపెన్ అయిన బ్రహ్మముడి సీరియల్ నటి!

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్..బిగ్ బాస్ 10 లోకి కన్నడ హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనా సెర్చింగ్.. మనోజ్ పై బాలుకు అనుమానం.. షీలా ఎంట్రీ హైలెట్..

Podarillu Today Episode : మొక్కు గురించి భయపడుతున్న నారాయణ.. మనీష లైఫ్ లో కొత్త విలన్.. ఇదే అసలు ట్విస్ట్..

Nindu Noorella Saavasam Serial Today Episode August 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు షాక్‌ ఇచ్చిన అమర్‌ – మనోహరిని హెచ్చరించిన చంభా

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో ధీరజ్ షాక్.. రామారాజుకు అవమానం.. అయ్యో పాపం ధీరజ్..

Intinti Ramayanam Today Episode: అవని సేఫ్..పల్లవికి దిమ్మతిరిగే షాక్..భానుమతి కి కమల్ ఝలక్..

Big Stories

Advertisement
×