IRCTC vs RailOne Comparison: తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే స్పీడ్ చాలా ముఖ్యం. బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సీట్లు నిండిపోతాయి. అందుకే, చాలా మంది ప్రయాణికులు IRCTC యాప్ బెటరా? లేక రైల్ వన్ యాప్ బెటరా? అని ఆలోచిస్తుంటారు. ఈ రెండు ప్లాట్ ఫారమ్ ల మధ్య ఉన్న తేడాలను తెలుసుకుంటే ఏది బెస్ట్ అనేది తెలుస్తుంది.
అత్యవసర ప్రయాణాల వేళ తత్కాల్ టికెట్లు చాలా మందికి ఉపయోగపడతాయి. అయితే, ఈ టికెట్ పొందాలంటే బుకింగ్ అనేది స్పీడ్ గా పూర్తవ్వాలి. ఈ విషయంలో అధికారిక రైల్వే టికెటింగ్ ప్లాట్ ఫారమ్ అయిన IRCTC బెస్ట్ అనేది చాలా మంది అంటుంటారు.
IRCTC భారతీయ రైల్వే అధికారిక ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు దీనిని ఉపయోగిస్తున్నారు. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ తో నేరుగా లింకై ఉండటం దీనికి ఉన్న అడ్వాంటేజ్. అందువల్ల టికెట్ అవైలబులిటీ, సీట్ల కేటాయింపు, చెల్లింపుల ప్రక్రియ లాంటి అంశాలు వేగంగా జరుగుతాయి. తత్కాల్ బుకింగ్ సమయంలో ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పటికీ సర్వీసులు సజావుగా అందించేందుకు IRCTC తరచూ తన సర్వర్లు, టెక్నికల్ వ్యవస్థలను అప్ డేట్ చేస్తూ ఉంటుంది.
రైల్వేకు సంబంధించిన అన్ని సర్వీసులను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో రైల్ వన్ యాప్ రెడీ అయ్యింది. ఇందులో టికెట్ బుకింగ్‌తో పాటు రైలు సమాచారం, సర్వీసుల వివరాలు, ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ తో వస్తుంది. ఒకే యాప్ లో అన్ని రైల్వే సేవలను ఉపయోగించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.
తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో మాత్రం IRCTC యాప్ బెస్ట్ అంటున్నారు టెక్నికల్ నిపుణులు. ఎందుకంటే, ఇది నేరుగా రైల్వే రిజర్వేషన్ వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. మరోవైపు రైల్ వన్ వంటి ఇతర యాప్‌లు IRCTC సిస్టమ్ ద్వారా సమాచారాన్ని పొందుతాయి. ఈ ప్రక్రియలో కాస్త టైమ్ డిలే ఉండే అవకాశం ఉంది. తత్కాల్ బుకింగ్‌లో కొన్ని సెకన్లు కూడా చాలా ముఖ్యం. సో, చాలామంది ప్రయాణికులు నేరుగా IRCTC యాప్‌ను ఉపయోగించడానికే మొగ్గు చూపుతున్నారు.
⦿ బుకింగ్ సమయానికి ముందే IRCTC ఖాతాలో లాగిన్ కావాలి.
⦿ ప్రయాణికుల వివరాలను మాస్టర్ లిస్ట్ లో ముందుగానే సేవ్ చేయాలి.
⦿ IRCTC e-Walletలో డబ్బు ఉంచుకుంటే చెల్లింపు వేగంగా పూర్తవుతుంది.
⦿ మంచి స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించాలి.
⦿ బుకింగ్ ప్రారంభమైన వెంటనే ప్రక్రియ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండాలి.
మొత్తంగా.. రైల్ వన్ యాప్ అన్ని రైల్వే సేవలను అందించే మంచి ప్లాట్ ఫారమ్ అయినప్పటికీ, తత్కాల్ టికెట్ బుకింగ్ లో వేగం, నేరుగా కనెక్టివిటీ పరంగా IRCTCకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. కన్ఫర్మ్ తత్కాల్ టికెట్ అవకాశాలను పెంచుకోవాలంటే ముందుగా రెడీ కావడంతో పాటు IRCTCలో బుకింగ్ చేయడం బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారు.
Read Also: తత్కాల్ టికెట్ వెంటనే కన్ఫర్మ్ కావాలా? IRCTCలో సింపుల్ గా ఈ సెట్టింగ్స్ చేయండి!