E-Paper
Advertisement

Kissik Talks: ‘అమ్మోరు’లో మొదట నాకే అవకాశం వచ్చింది.. ఎందుకు చేయలేదంటే? – లయ

Kissik Talks: ‘అమ్మోరు’లో మొదట నాకే అవకాశం వచ్చింది.. ఎందుకు చేయలేదంటే? – లయ
Advertisement

Kissik Talks: తెలుగు ప్రేక్షకులకు నటి లయ (Actress Laya) పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన లయ, ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎన్నో పాత్రల్లో మెరిశారు. మ్యారేజ్ అనంతరం.. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా లయ, రీసెంట్‌గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఛైల్డ్ ఆర్టిస్ట్ నుంచి, ప్రస్తుతం తను చేసిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ వరకు తన సినీ జర్నీ ఎలా నడిచిందో తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్‌ (Big TV Kissik Talks)లో తెలిపారు. మరీ ముఖ్యంగా ‘అమ్మోరు’ (Ammoru) సినిమాలో ముందు తనకే అవకాశం వచ్చినా, ఆ ఛాన్స్ సునయనకు ఎందుకు వెళ్లిందో వివరంగా చెప్పారు. అసలు తను ఎందుకు ఆ పాత్ర చేయలేకపోయిందనే విషయం గురించి చెబుతూ..

‘అమ్మోరు’లో అందుకే చేయలేకపోయా!

‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేను ఒక సినిమా చేశా. నేను పిక్నిక్‌కు వెళితే.. యాక్సిడెంటల్‌గా అక్కడ దర్శకుడు నన్ను చూసి సినిమాలో చేయించారు. అది పిల్లల చిత్రం. చైల్డ్ లేబర్‌పై సినిమా. మొత్తం 30 మందిని సెలక్ట్ చేశారు. అందులో మెయిన్ ఎవరు చేయాలనే దానిపై టెస్ట్‌లు పెడితే.. నేను సెలక్ట్ అయ్యాను. ఆ సినిమా నేను చేసినప్పుడు నాల్గవ క్లాస్ చదువుతున్నా. సినిమా రిలీజ్ అయ్యే నాటికి 7వ తరగతి చదువుతున్నా. అప్పటికి కొంచెం పెద్దయ్యాను. ఈ సినిమా చూసి ‘అమ్మోరు’ సినిమాలో ఆఫర్ వచ్చింది. కాకపోతే వాళ్లు సినిమాలో చూసినప్పుడు నేను 4వ తరగతి, వాళ్లు నన్ను సంప్రదించినప్పుడు 7లో ఉన్నా. ఆ పాత్రకి పెద్దదాన్ని అవుతాను. అందుకే ఆ పాత్ర సునయన చేశారు. ఏజ్ డిఫరెన్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయాను.

Advertisement

Also Read- Actress Laya: ఓన్లీ వెజిటేరియన్.. నటి లయ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా!

శివాజీతో అప్పటి నుంచి పరిచయం..

నేను 10వ తరగతి చదివేటప్పుడు 1995లో స్టార్ 2000 కాంటెస్ట్ పెట్టారు. ‘పరదేశి’ సినిమా కోసం సెలక్షన్స్ పెట్టారు. నేను, శివాజీ అక్కడే కలిశాం. ఇద్దరం సెలక్ట్ అవలేదు. సెకండ్ వచ్చింది ఇద్దరికి. అక్కడి నుంచే మా జర్నీ మొదలైంది. నాకప్పుడు సినిమాలంటే పెద్దగా తెలియదు. అనుకోకుండా సినిమాలోకి తీసుకున్నారు. అనుకోకుండా సినిమాల్లో చేయడం జరిగింది. ఇంటర్ చదివే టైమ్‌లో సినిమాలు చేశాను. చదువుకుంటూనే సినిమాలు చేశా. ‘స్వయంవరం’ సినిమా అలానే చేశాను. ఇక శివాజీతో అప్పటి నుంచి జర్నీ మొదలై.. ఇప్పుడు ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ వరకు వచ్చింది.

ఐటీలో జాబ్ చేశా..

Advertisement

ఇప్పుడొక రియాలిటీ షోకు జడ్జ్‌గా చేస్తున్నాను. 2006 నుంచి 2011 వరకు ఆన్ అండ్ ఆఫ్ రియాలిటీ షోస్ చాలా చేస్తూ ఉన్నాను. 2011 నుంచి ఎప్పుడైతే జాబ్ తీసుకున్నానో.. ఇక రియాలిటీ షోస్‌కు వెళ్లలేదు. ఐటీలో పని చేశాను. చదువుకున్నాను కదా.. ఏదో ఒకటి చేయాలిగా! 2011 నుంచి నితిన్‌తో చేసిన ‘తమ్ముడు’ సినిమాలో అవకాశం వచ్చే వరకు జాబ్ చేశాను. ఆ సినిమా షూటింగ్‌ కోసమని రిజైన్ చేశాను. జాబ్ చేసే సమయంలో అప్పుడప్పుడు ఆఫీస్‌కు వెళ్లేదాన్ని. ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమే చేసేదాన్ని. నేను సినిమాల్లోకి రాకుండా ఉంటే, ఇంజనీరింగ్ చేసి అలాగే జాబ్ చేసేదాన్ని. మధ్యలో సినిమాల్లోకి వచ్చాను. తర్వాత ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉండడం అలవాటు లేక.. ఏదో ఒక జాబ్ చేయాలని ట్రై చేశా.. అవకాశం వచ్చింది.

Also Read- Big TV Kissik Talks: నువ్వేంటి నాకు చెప్పేది? అనే వారే కానీ.. శివాజీ కాంట్రవర్సీపై లయ!

అవకాశం వస్తే ఆలోచించండి

మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నేను అనుకోలేదు. ఆఫర్ వచ్చిందని వచ్చి చేశాను. అంతకు ముందు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ, వర్కవుట్ అవ్వలేదు. మా ఇంటిలో ప్రతీది డిస్కస్ చేసినట్లుగానే ‘తమ్ముడు’ సినిమా గురించి కూడా చేశాం. అంతకు ముందు వచ్చిన పాత్రలో ఎందుకనో వర్కవుట్ అవ్వలేదు. కానీ, ఈ సినిమాకు పొటెన్షియల్ ఉంది.. ఇదయితే బాగుంటుంది అని చెప్పాను. అయితే అప్పటికి సెలక్ట్ కాలేదు. ఇంట్లో వాళ్లని అడిగితే.. నీకు అవకాశం వస్తే వెళ్లి చెయ్.. అని అన్నారు. ఈ ఫీల్డ్ అనే కాదు.. ఏ ఫీల్డ్ అయినా సరే.. అవకాశం వచ్చినప్పుడు ఆలోచించుకోండి.. ఏది ప్రయారిటీ, ఏది కాదు అని. ఒకవేళ చేయలేకపోతే మాత్రం ఆలోచించకండి. అవకాశం వచ్చినప్పుడు, మీకు అది కావాలని అనిపించినప్పుడు, అది ఆ టైమ్‌లో తీసుకోవడమే కరెక్ట్. అప్పటి పరిస్థితుల వల్ల తీసుకోలేకపోతే మాత్రం రిగ్రెట్ అవ్వవద్దు’’ అని లయ చెప్పుకొచ్చారు.

Also Read- Tamannaah Bhatia: తమన్నాకి ముద్దు పెట్టిన అభిమాని…షాక్ లో ఫాన్స్ అసలేం జరిగిందంటే?

Related News

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Podarillu Today Episode : జయంతి తమ్ముడు అవమానం.. చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. జయంతి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×