E-Paper
Advertisement

Cm revanth : సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

Cm revanth : సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?
Advertisement

రాష్ట్రంలో మూసీ పునరుజ్జీవాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. మూసీని ఆధునీకరించి నగరవాసులకు ట్రాఫిక్ లేని, క్లీన్ సిటీని అందించాలని ఆయన కంకణం కట్టుకున్నారు.వర్షాకాలం వచ్చేలోపు నగరంలో నాలాలపై నిర్మించి ఇండ్లు, కట్టడాలను తొలగించి వారికి వేరే చోట ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుకు అడ్డుతగులుతున్నారని సీఎం రేవంత్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.శుక్రవారం మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవంపై అనుమానాలు నివృత్తి చేసేలా కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో సీఎం పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

బాధితులకు నష్టపరిహారం..

మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఎవరైతే భూములు, ఇండ్లు కోల్పోతున్నారో వారికి మంచి నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అంతేకాకుండా వారికి ఇందిరమ్మ ఇండ్లు సైతం కేటాయిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం మానుకోవడం లేదు. కేవలం రాజకీయ ఎజెండాతో బాధితులను రెచ్చగొట్టి మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.ఒకవేళ నిజంగా పేదలకు నష్టం వాటిల్లితే వారికి పరిహారం కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ పొరాటం చేయడంలో తప్పులేదు. ప్రభుత్వం బాధితుల పక్షాన ఉంటానని ప్రకటించినా ప్రతిపక్షం మాత్రం చీప్ పాలిటిక్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రాజెక్టు వ్యయంపై క్లారిటీ..

Advertisement

మూసీ పునరుజ్జీవానికి సుమారు రూ.7 వేల కోట్లు అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక అందులో భాగంగా ‘గాంధీ సరోవర్’ బాపుఘాట్ వద్ద నిర్మించే గాంధీ విగ్రహానికి రూ.75 కోట్లు అవుతాయని సీఎం ప్రకటించారు.కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత,మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రం మూసీ ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లకు పైగా అవుతాయని, గాంధీ సరోవర్‌కు రూ.5వేల కోట్లను సర్కారు వృథా చేస్తున్నదని అదే పనిగా ప్రచారం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు.తప్పుడు ప్రచారాలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని బీఆర్ఎస్ నేతలకు ఆయన హితవు పలికారు.

Actress Laya: ఓన్లీ వెజిటేరియన్.. నటి లయ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా!

మూసీ పక్కన 3 నెలలు ఉంటారా?

Advertisement

మూసీ పక్కన ఉండే కుటుంబాలు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని, వారి కోసమే సుందరీకరణ చేపట్టి వారికి వేరే చోట ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం క్లారిటీ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే బీఆర్ఎస్ నేతలు ఒక మూడు నెలల పాటు మూసీని ఆనుకుని పేదలు ఉంటున్న చోట ఉండాలని సవాల్ విసిరారు.అప్పుడు వారి స్థితిగతులు, బాధలు తెలుస్తాయని అన్నారు. అవేమీ పట్టించుకోకుండా మూసీ ప్రాజెక్టును అడ్డుకోవడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. నిజంగానే ఈ ప్రాజెక్టు పనికిరాదని అనుకుంటే ప్రజలంతా వ్యతిరేకించాలని, అప్పుడు దీనిని పక్కనబెడతామని స్పష్టంచేశారు. మీకు మాత్రం సొంత ఫాంహౌస్‌లు ఉండొచ్చు కానీ, పేదలకు మంచి ఇండ్లు ఉండకూడదా? అని ప్రశ్నించారు. మూసీని సుందరీకరించి నైట్ బజార్లను ఓపెన్ చేస్తామని అప్పుడు నిరుపేదలు, చిరు వ్యాపారులకు ఉపాధి దొరుకుతుందని సీఎం చెప్పారు. కాగా, సీఎం విసిరిన సవాల్‌పై బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×