Bigg Boss 9 Telugu : టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో తొమ్మిదోవ సీజన్ ప్రసారం అవుతుంది. ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో తొమ్మిదోవ వారం ఆసక్తిగా మారింది. ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఎవరు బయటకు వస్తారా అన్న ఆసక్తి జనాల్లో నెలకొంది. అయితే ఊహించని ట్విస్ట్ బిగ్ బాస్ లో జరిగింది. హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫోక్ సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇది ఎవరు ఊహించలేదు. కానీ అతను కొన్ని కారణాలతో బయటకు వచ్చాడని తెలుస్తుంది. అయితే రామ్ పెర్ఫార్మన్స్ కొద్ది రోజులుగా సరిగ్గా లేదని, ఆటల్లో సరిగ్గా అతను ఆడలేకపోయాడు. మొత్తానికి అతనే బయటకు వచ్చేసాడు. తొమ్మిది వారాలకు ఆయన సంపాదించాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బిగ్ బాస్ 9 నుంచి రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.. ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు ఇక్కడ ఉండలేకపోతున్నాను అని రామ్ హౌస్ నుంచి బయటికి వచ్చేసాడు. మొదటినుంచి ఫైర్ తో ఆడిన రామ్ ఇలా సెల్ఫ్ ఎలిమినేషన్ తో బయటికి రావడంతో ఆయన అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.. టాస్క్ లలో తనదైన రీతిలో రానిస్తూ నెగిటివిటిని లేకుండా చూసుకున్నాడు. ఇతను హౌస్ లో దాదాపుగా 60 రోజులకు పైగానే బిగ్‌బాస్‌లో రాము ఉన్నాడు. దీంతో ఆయన భారీగానే రెమ్యునరేషన్ రూపంలో సంపాధించాడు. ఒక వారానికి రెమ్యునరేషన్‌గా రూ. 2లక్షల వరకు తీసుకున్నట్లు టాక్ ఉంది. దీంతో 9వారాలకు గాను బిగ్‌బాస్‌తో అతను రూ. 18 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికి హౌస్ లో ఉండి బాగానే సంపాదించాడు..
Also Read :కొత్త అవతారం ఎత్తబోతున్న హీరో.. రిస్క్ అవసరమంటావా..?
రామ్ హౌస్ నుంచి బయటకు వస్తు.. బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా అంటూ ఎమోషనల్ అయ్యాడు అంటూ ఇలా చెప్పుకొచ్చాడు. తన చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది.. అలానే దగ్గరుండి చూసుకోవాలని నా కోరిక అంటూ రామ్ స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రామ్ గురించి చెప్పాలంటే.. యూట్యూబర్ గా తన కెరీర్ నువ్వు మొదలుపెట్టి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఆయన పాడిన బొంబాయి కి రాను పాట మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవడం మామూలు విషయం కాదు. ఈ పాట మీద రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన రామ్ మళ్లీ తన యూట్యూబ్ ఛానల్ ని తిరిగి ప్రారంభిస్తాడేమో చూడాలి..