Tirupati Crime: ఒకప్పుడు చావంటే భయపడేవారు. ఇప్పుడు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఆపై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి కన్న తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్న వయస్సులో ఆ చిన్నారులకు నిండు నూరేళ్లు నిండాయి. అసలేం జరిగింది?
దారుణం.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
పచ్చని సంసారంలో ఫ్యామిలీ సమస్యలు చిచ్చు రేపుతున్నాయి. ఫలితంగా పెద్దవారితోపాటు అన్నెం పుణ్యం ఎరుగని చిన్నారులు పసి వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. కేవలం దంపతుల ఇగోల వల్ల చిన్నారులకు ఈలోకానికి దూరమవుతున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరు ప్రాంతంలో అలాంటి ఘటన ఒకటి జరిగింది.
తిరుపతి జిల్లా సూళ్లురుపేట మండలం ఉగ్గుముడిలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతులు వరలక్ష్మి వయస్సు 24 ఏళ్లు కాగా, వారి ఇద్దరు పిల్లలు వర్షిత్ నాలుగేళ్లు, ప్రశాంత్‌కు రెండేళ్లు. ఉగ్గుమూడి గ్రామానికి చెందిన వరలక్ష్మిని అదే గ్రామానికి చెందిన మాదవయ్య వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒకరు వర్షిత్ కాగా, మరొకరు ప్రశాంత్.
ఫ్యామిలీ చిచ్చు.. భర్తపై అలిగి
కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న మాదవయ్య-వరలక్ష్మి దంపతుల కాపురంలో చిన్నపాటి చిచ్చు మొదలైంది. అది కాస్త తీవ్రరూపం దాల్చింది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఆ ఇంటి ఇల్లాలు వరలక్ష్మి అలిగింది. భర్తపై కోపంతో మూడు రోజుల కిందట పుట్టింటికి పిల్లలను తీసుకుని వెళ్లింది.
భర్తతో గొడవ జరిగిన విషయం పుట్టింట్లో చెప్పలేదు వరలక్ష్మి. ఒకవేళ చెప్పినా వారి పేరెంట్స్ సీరియస్ గా తీసుకునేవారు. దంపతుల మధ్య ఇలాంటి గొడవలు సహజమేనని సరిపెట్టుకునేవారు. పదే పదే భర్తపై తనకున్న కోపాన్ని గుర్తు చేస్తుకుంటూ రగిలి పోయేది వరలక్ష్మి. తాను-పిల్లల వల్ల తల్లిదండ్రులకు భారంగా మారుతానని భావించింది. చివరకు ఇంట్లోవాళ్లు పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు.
ALSO READ: ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టిన తుపాను వాహనం.. స్పాట్‌లో నలుగురు
ఆ సమయంలో వరలక్ష్మి తన ఇద్దరు పిల్లలను ఊరిలోని పొలం వద్దకు తీసుకెళ్లింది. తల్లి-పిల్లలు అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు, భర్త కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు చేరుకుని డెడ్ బాడీలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.