E-Paper
Advertisement

Deepika Padukone: బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా.. వివక్షపై దీపిక సంచలన కామెంట్స్!

Deepika Padukone: బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా.. వివక్షపై దీపిక సంచలన కామెంట్స్!
Advertisement

Deepika Padukone: దీపికా పదుకొనే (Deepika Padukone).. బాలీవుడ్ బ్యూటీగా , భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. గత కొన్ని నెలలుగా నెగిటివ్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘కల్కి 2898 ఏడి’ చిత్రంలో సుమతి క్యారెక్టర్ లో తన నటనతో అందరినీ అబ్బురపరిచిన దీపికకి సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) ప్రభాస్ (Prabhas ) తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం కల్పించారు. కాకపోతే ఈమె అత్యధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, పైగా 8 గంటల పని దినాలు కావాలని కోరడంతో ఆ సినిమా నుండి ఈమెను తప్పించారు. ఆ సమయంలో సందీప్ రెడ్డివంగా – దీపికా పదుకొనే మధ్య కోల్డ్ వార్ కూడా జరిగింది.
దీంతో చాలామంది సందీప్ పైనే విమర్శలు గుప్పించారు.. కారణం ఆ సమయంలోనే దీపిక పండింటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా.

వరుస విమర్శలు ఎదుర్కొన్న దీపిక..

తర్వాత కల్కి 2898AD సీక్వెల్ లో కూడా దీపిక నటిస్తుందంటూ వార్తలు వినిపించాయి. కానీ వైజయంతి మూవీస్ ఆమెను తప్పిస్తూ అధికారిక ప్రకటన చేసింది. దీంతో దీపికదే తప్పు అని చాలా మంది ఆమెపై విమర్శలు గుప్పించారు. ఇక దీనికి ఈమె ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో కౌంటర్లు వేసిన విషయం తెలిసిందే. అలా ఇండస్ట్రీపై.. ఇండస్ట్రీలో షూటింగ్ పని దినాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన దీపిక.. ఇప్పుడు మరొకసారి ఏకంగా హాలీవుడ్ పై సంచలన కామెంట్లు చేసింది. అక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు అంటూ మండిపడింది.

హాలీవుడ్ పై దీపిక సంచలన కామెంట్స్..

Advertisement

దీపికా పదుకొనే ‘రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ అనే చిత్రంతో తొలిసారి హాలీవుడ్ లోకి అడుగుపెట్టి అప్పుడే తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే 2017 లో ఈ సినిమా విడుదల అవ్వగా ఈ సినిమా సమయంలో భారతీయ యాసలో మాట్లాడింది దీపిక. అయితే ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా సిఎన్బిసి (CNBC) గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ సందర్భంగా జరిగిన సంభాషణలో దీపిక హాలీవుడ్ వెళ్లడం గురించి, అలాగే అక్కడి దేశాలలో భారతదేశం పట్ల వారికున్న ఆలోచన పట్ల తాను గమనించడం గురించి అన్నీ క్లారిటీ ఇచ్చింది.

ALSO READ:Srinivas Reddy: చైతూ కోసం 10 నెలల కష్టం వృధా.. ఆ సూపర్ హిట్ సీక్వెల్ పై డైరెక్టర్ కామెంట్!

రంగు, యాసపై వివక్ష..

Advertisement

దీపిక మాట్లాడుతూ..” నేను విదేశాలకు వెళ్లిన ప్రతిసారి కూడా నన్ను బాధ పెట్టిన అంశం రంగు, యాస వివక్ష.. అందరూ అనుకుంటున్నట్లు హాలీవుడ్లో ప్రతిదీ నిజాయితీగా, సక్రమంగా ఏమీ జరగదు. భారతీయ నటీనటులు అక్కడ వివక్షను ఎదుర్కొంటున్నారు. శరీర రంగు ఆధారంగా వివక్ష చూపిస్తుంటారు. స్కిన్ కలర్ తో పాటు మన ఇంగ్లీష్ యాసపై కూడా అక్కడ చిన్న చూపు ఉంటుంది. ఆ వివక్షలన్నింటినీ కూడా నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఇప్పటికీ ఆ బాధను నేను మర్చిపోలేక పోతున్నాను. హాలీవుడ్ లో కూడా వివక్ష ఉంది” అంటూ సంచలన కామెంట్లు చేసింది దీపిక.

హాలీవుడ్లో భారీ పాపులారిటీ..

ఇకపోతే దీపిక హాలీవుడ్లో నటించడమే కాకుండా అంతర్జాతీయ కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. లూయిస్ విట్టన్ కు ప్రపంచ రాయబారిగా వ్యవహరిస్తున్నాయి. 2022లో 75 వ కేఎంసి ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది. అదే సంవత్సరం ఖతార్ జరిగిన ఎఫ్ ఐ ఎఫ్ ఏ (FIFA ) ప్రపంచ కప్ ఫైనల్లో కూడా ట్రోఫీలను ఆవిష్కరించింది. అంతేకాదు మోషన్ పిక్చర్స్ విభాగంలో 2026 హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ క్లాస్ కి దీపిక గౌరవనీయులలో ఒకరిగా ఎంపికయింది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×